రిస్క్ చేస్తున్న మంచు మనోజ్ !

హీరో మంచు మనోజ్ కి అన్ని ఉన్నాయి. కానీ అదృష్టమే లేదు. అది లేకపోతే ఎంత సపోర్ట్ ఉన్నా ఏమి లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తోందనేది ఇప్పటికే చాలామంది విషయంలో ప్రూవ్ అయింది. మనోజ్ విషయం కూడా అందుకు ఉదాహరణనే. నిజానికి మంచు మనోజ్ కి స్టార్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నా.. మాములు హీరోలాగే కూడా మనోజ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు. మొదటినుండి మంచి సినిమాలు చేయాలని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఎందుకో […]

Written By: admin, Updated On : November 6, 2020 7:44 pm
Follow us on


హీరో మంచు మనోజ్ కి అన్ని ఉన్నాయి. కానీ అదృష్టమే లేదు. అది లేకపోతే ఎంత సపోర్ట్ ఉన్నా ఏమి లేనివాడిగా మిగిలిపోవాల్సి వస్తోందనేది ఇప్పటికే చాలామంది విషయంలో ప్రూవ్ అయింది. మనోజ్ విషయం కూడా అందుకు ఉదాహరణనే. నిజానికి మంచు మనోజ్ కి స్టార్ హీరో కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నా.. మాములు హీరోలాగే కూడా మనోజ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు. మొదటినుండి మంచి సినిమాలు చేయాలని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఎందుకో సక్సెస్ ఫుల్ సినిమాలు చెయ్యలేకపోయాడు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

దీనికితోడు మేకింగ్ లో మనోజ్ ఇన్ వాల్వ్ అవుతాడని.. డైరెక్టర్లు దూరం జరిగితే.. సినిమా బిజినెస్ లో కూడా మనోజ్ వేలు పెడతాడు అని.. నిర్మాతలు మనోజ్ కి దూరం జరిగారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తనే ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ పెట్టి.. సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించానని మంచు మనోజ్ చెప్పుకుంటున్నా.. ఆ ప్రొడక్షన్ హౌస్ తనతో సినిమాలు చేయడానికే అనే విషయం మాత్రం అందరికీ తెలిసిందే. పైగా పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్నాడు. తన కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని పాన్ రేంజ్ లో తానే నిర్మాతగా చేయడం అంటే మాటలా..!

Also Read: మరోసారి రెచ్చిపోయిన రోజా-శేఖర్ మాస్టర్..!

ఈ క్రమంలోనే మనోజ్ కాస్త ఆర్ధిక కష్టాల్లో కూడా పడ్డాడని ఆ మధ్య ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ ఫైట్ కోసం మనోజ్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి సెట్ వేయించి అందులో షూట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. నిజంగా ఇది డేరే. ఒక్క ఫైట్ కోసం కోటి రూపాయలు పెట్టడం అంటే.. అది పెద్ద హీరోలకే సాధ్యం కాదు ఒక్కోసారి. ఏమైనా సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా మనోజ్ సిద్ధ పడటం నిజంగా గొప్ప విషయమే. ఇక కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి మనోజ్ కి ఈ సినిమాతోనైనా మంచి హిట్ వస్తోందేమో చూడాలి.