https://oktelugu.com/

రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు.. ఎలా అంటే..?

అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చని ఇప్పటికే చాలామంది ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అదృష్టం ఎవరికి ఏ విధంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరిని లక్కీ డ్రాలు అదృష్టవంతులను చేస్తే మరి కొందరిని ఊహించని విధంగా అదృష్టం తలుపు తడుతోంది. తాజాగా ఇండోనేషియాలోని ఒక వ్యక్తికి అదృష్ట దేవత తలుపు తట్టింది. శవపేటికలు తయారు చేసుకునే ఆ వ్యక్తికి రాత్రికి రాత్రే 10 కోట్ల రూపాయలు సొంతమయ్యాయి. ఆకాశం నుంచి పడిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2020 / 09:41 PM IST
    Follow us on


    అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చని ఇప్పటికే చాలామంది ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అదృష్టం ఎవరికి ఏ విధంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరిని లక్కీ డ్రాలు అదృష్టవంతులను చేస్తే మరి కొందరిని ఊహించని విధంగా అదృష్టం తలుపు తడుతోంది. తాజాగా ఇండోనేషియాలోని ఒక వ్యక్తికి అదృష్ట దేవత తలుపు తట్టింది. శవపేటికలు తయారు చేసుకునే ఆ వ్యక్తికి రాత్రికి రాత్రే 10 కోట్ల రూపాయలు సొంతమయ్యాయి.

    ఆకాశం నుంచి పడిన ఒక ఉల్క ఇంటి పై కప్పు నుంచి ఉల్క రూపంలో ఇంట్లో పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే జోసువా హుటగలుంగ్ అనే వ్యక్తి ఇండోనేషియాలోని కోలంగ్ లో రేకులతో నిర్మించుకున్న ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ శవపేటికలు తయారు చేస్తే మాత్రమే అతను కడుపు నిండా ఆహారం తినగలిగాడు. ఎంత కష్టపడినా చాలీచాలని ఆదాయం వస్తుండగా ఆ ఆదాయంతోనే జోసువా జీవనం సాగిస్తున్నాడు.

    జోసువా ఇంట్లో శవపేటికను తయారు చేస్తున్న సమయంలో ఊహించని విధంగా ఆకాశం పై నుంచి ఒక ఉల్క పడింది. ఆ సమయంలో ఒక ఉల్క ఇంటి పై కప్పు నుంచి పడి ఇంట్లొ భూమిలోపలికి కూరుకుపోయింది. ఊహించని పరిణామంతో మొదట కంగారు పడిన జోసువా ఆ తరువాత ఉల్క దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. దాదాపు 2 కేజీల బరువు ఉన్న ఈ ఉల్కను ఖగోళ శాస్త్రవేత్తలు 10 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు.

    జోసువా ఉల్క పడిన సమయంలో తనకు భయం వేసిందని ఇల్లు ఒక్కసారిగా కదిలిందని.. అరుదైన రకానికి చెందిన ఉల్క కావడంతో అంత మొత్తం చెల్లించి శాస్త్రవేత్తలు కొనుగోలు చేశారని జోసువా తెలిపారు.