వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..?

గత కొన్ని నెలల నుంచి వాట్సాప్ యాప్ కస్టమర్లకు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎవరికైనా వీడియోలను పంపాలన్నా ఆ వీడియోలను స్టేటస్ అప్ డేట్ గా పెట్టుకోవాలన్నా మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ యాప్ కల్పించనుంది. వాట్సాప్ యాప్ తొలుత ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. అనంతరం […]

Written By: Navya, Updated On : November 20, 2020 7:14 am
Follow us on


గత కొన్ని నెలల నుంచి వాట్సాప్ యాప్ కస్టమర్లకు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎవరికైనా వీడియోలను పంపాలన్నా ఆ వీడియోలను స్టేటస్ అప్ డేట్ గా పెట్టుకోవాలన్నా మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ యాప్ కల్పించనుంది.

వాట్సాప్ యాప్ తొలుత ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. అనంతరం ఐఫోన్ యూజర్లకు సైతం ఇదే ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ డబ్ల్యూఏబీటల్‌ఇన్ఫో ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాట్సాప్ యూజర్లకు కొత్త ఫీచర్ అప్ డేట్ అయితే వీడియోతో పాటు స్పీకర్ బటన్ రూపంలో ఒక ఆప్షన్ కనిపిస్తుంది.

వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్ పై ప్రయోగాలు చేస్తోందని తెలుస్తోంది. ‘రీడ్ లేటర్’ పేరుతో ఈ కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే బీటా టెస్టింగ్ కు మాత్రం ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉందని తెలుస్తోంది. వాట్సాప్ భవిష్యత్తులో మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా యూజర్లకు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత చేరువ కావచ్చని వాట్సాప్ భావిస్తోంది. వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్న ఫీచర్లు తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.