Singer Sunitha: సింగర్ సునీత తల్లి కాబోతుంది అని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఐతే, సునీత ఈ రోజు ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా తెలియజేస్తూ ఫోటోతో పాటు ఒక పోస్ట్ పెట్టింది. పైగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ పోస్ట్ లో సునీత ఏమి పెట్టింది అంటే.. మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయను పట్టుకుని ‘బ్లెస్ట్’ అని మెసేజ్ చేసింది సునీత.

ఈ పోస్ట్ వెనకున్న కారణమేంటి అని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘సునీత తల్లి కాబోతోందని; అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. సరోగసి ద్వారా పిల్లలను కనాలని సునీత నిర్ణయించుకుంది. సునీతకి మళ్లీ తల్లి కావాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే, సరోగసి ద్వారానే పిల్లలను కనాలని ఆమె ముందు నుంచి ప్లాన్ చేస్తూ వచ్చింది.
Also Read: Koratala Shiva: ‘ఎన్టీఆర్ హీరోయిన్’ పుకార్ల పై కొరటాల వివరణ.. ఫ్యాన్స్ కి ఇది షాకే
ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్ళింది. ఇక సునీత రెండో భర్త రామ్ పెద్ద డిజిటల్ కంపెనీకి ఓనర్. అందుకే డిజిటల్ లోకి సునీత కూడా ఎంటర్ కానుంది. సునీత భర్త రామ్ కంపెనీ చిన్న చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉంది. అయితే, ఆ చిన్న చిత్రాల నిర్మాణ పరంపరను సునీత నేపథ్యంలో సాగుతుందని.. కథల ఎంపిక దగ్గర నుంచి నిర్మాణం వరకు అన్నీ ఆమె చూసుకుంటుందని తెలుస్తోంది.
పైగా సునీతనే నిర్మాతగా వ్యవహరించే విధంగా రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సింగర్ గా ఎంతో పాపులారిటీ సాధించిన సునీత, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సునీతకు బుల్లితెర పై బోలెడు మంది అభిమానులు ఉన్నారు, అందుకే సునీత బుల్లితెర కోసం కూడా ప్రత్యేక ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తోంది. మొత్తానికి భర్త రామ్ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు.

సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఏది ఏమైనా సునీత గాత్రం ఎంతో కమ్మగా ఉంటుంది. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనాన్ని ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Minister Roja: మంత్రి రోజా మళ్లీ రావాలన్న జబర్దస్త్ టీం
View this post on Instagram