Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Chandrababu: పవన్ కళ్యాణ్ ను సీఎం చేయి.. గెలుస్తావు.. చంద్రబాబుకు ‘రాజగురువు’ సంచలన...

Pawan Kalyan- Chandrababu: పవన్ కళ్యాణ్ ను సీఎం చేయి.. గెలుస్తావు.. చంద్రబాబుకు ‘రాజగురువు’ సంచలన సలహా..

Pawan Kalyan- Chandrababu: నాడు ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబును సీఎంను చేయడంలో ఈ రాజగురువే కీలకపాత్ర పోషించాడు. సచ్చీలుడు అయిన ఎన్టీఆర్ పై సవతి (లక్ష్మీపార్వతి) పగను చూపించాడు. లక్ష్మీపార్వతిని చూపించి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయించాడు. ఎందుకంటే నాడు రాజగురువు మాటను ఎన్టీఆర్ వినలేదు. అందుకే వినని వారిని దించేసి వినే చంద్రబాబును దైవాంస సంభూతుడిగా తన మీడియాలో ప్రొజెక్ట్ చేశారు. అనక ఆయాచిత లబ్ధి చేకూర్చాడు. ఇప్పుడు చంద్రబాబు పని అయిపోయింది. అందుకే కొత్త జపం చేస్తున్నాడు.

Pawan Kalyan- Chandrababu
Pawan Kalyan- Chandrababu

మనం చాలా కథనాల్లో చెప్పుకున్నాం కదా… చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాదని… ఆ విషయాన్ని ఆయన బాగా నమ్మే “రాజగురువు” కూడా చెప్పాడు.. “ఇప్పుడు నువ్వు సొంతంగా ఎన్నికలకు వెళ్లినా… గెలిచే పరిస్థితి లేదు.. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.. ఈ ఎన్నికల్లో గెలవాలి అంటే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు” అని రాజ గురువు సలహా ఇచ్చాడు. ఇటీవల చంద్రబాబు ఆ రాజ గురువును కలిశాడు.. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొని కష్టాలను అనుభవిస్తున్న నేపథ్యంలో తన బాధను మొత్తం ఏ కరువు పెట్టాడు.. ఆ రాజ గురువు పరిస్థితి కూడా ఆంధ్ర ప్రదేశ్ లో అలానే ఉంది..తన వ్యాపార సంస్థలపై జగన్ ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో… ఇద్దరు సుమారు 5 గంటల పాటు భేటీ అయ్యారు.. చాలాసేపు మాట్లాడుకున్నారు.. అనేక విషయాలపై లోతుగా ఒక అధ్యయనం చేశారు.

తన ప్రధాన ఫైనాన్స్ బిజినెస్ ను ఏపీలో జగన్ క్లోజ్ చేశాడు. ఇప్పుడు పెట్టుబడికి ఇతర అవసరాలకు డబ్బులు లేవు. కాన కష్టంగా మారింది. సో జగన్ ను ఓడించాలి. తన వ్యాపారాన్ని ఏపీలో కొనసాగించాలంటే చంద్రబాబుతో కాదని రాజగురువుకు అర్థమైంది. చంద్రబాబును ప్రజల ముందు పెడితే ఓట్లు రావని రాజగురువు గ్రహించాడు. అందుకే నీతి నిజాయితీగల పవన్ ను ముందుపెట్టమని సలహా ఇచ్చాడు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టిడిపి సొంతంగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు.. ఒకవేళ వెళ్తే జనసేన కూడా పోటీలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలుతుంది.. ఇదే జరిగితే జగన్ కు లాభం చేకూరుతుంది. పైగా ఆయనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.. ఇది జరగకూడదు.. ఇది జరిగితే అటు రాజ గురువుకు, ఇటు చంద్రబాబుకు తీవ్ర నష్టం.. శత్రువు ముప్పు ఉండకూడదు.. అలాగని తమ చేతులకు మట్టి అంటకూడదు..ఈ క్రమంలోనే రాజ గురువు చంద్రబాబుకు ఒక ప్రపోజల్ పెట్టాడు.. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు.. అప్పుడు జనసేన పూర్తి కమిట్మెంట్ తో పనిచేస్తుంది.. జగన్ ముప్పు తప్పుతుంది అని చెప్పాడు.

Pawan Kalyan- Chandrababu
Pawan Kalyan- Chandrababu

రాజగురువు చెప్పిన మాట చంద్రబాబుకు ఎందుకనో నచ్చలేదు. అసలే ఇప్పుడు తాను 23 దగ్గరే ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియదు.. పైగా బీజేపీ నాయకులు జగన్ వైపు కూడా మొగ్గు చెబుతున్నారు.. పలు కీలక బిల్లులకు కూడా జగన్ నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇస్తున్నాడు.. ఇక పవన్ కూడా బిజెపి ఫోల్డ్ లోనే ఉన్నాడు.. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తే తనకు వచ్చే ఫాయిదా ఏమీ లేదని చంద్రబాబు తేల్చి చెప్పాడు.. అంతేకాదు తనకు ఇవి లాస్ట్ ఎన్నికలని పేర్కొన్నాడు. తన కొడుకు లోకేష్ బాబును వచ్చేసారి ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టాడు..

సదరు రాజ గురువుకు బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ద్వారా చంద్రబాబును అడిగించినట్లు తెలుస్తోంది.. అయితే పలు కీలక విషయాల్లో రాజ గురువు మాటలు వినే చంద్రబాబు… ఈసారి ఎందుకో అంతగా చెవికి ఎక్కించుకోలేదు.. కాగా టిడిపి చేపట్టిన అంతర్గత సర్వేలో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే విజయం నల్లేరు మీద నడకే అని తేలింది. మరి ఈ విషయం చంద్రబాబుకు తెలిసిందో లేదో?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular