KCR On AP BRS: ఏపీలో బీఆర్ఎస్ విస్తిరించాలనకుంటున్న కేసీఆర్ ఉత్తరాంధ్రపై దృష్టిపెట్టారా? విశాఖలో బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ నిర్వహించడానికి డిసైడ్ అయ్యారా? సాగరనగరంలో బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ ఆలోచన వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర చర్చకు వచ్చింది. కేసీఆర్ పూర్తీకుల ప్రాంతం కావడం, వెలమ సామాజికవర్గం అధికంగా ఉండడం.. అంతకంటే బీసీలు ఎక్కువగా ఉండడం అక్కడ కన్సంట్రేట్ చేస్తారని టాక్ నడిచింది. అయితే ఆయన అనూహ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా తన టార్గెట్ కాపులని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు రెండో వ్యూహంలో భాగంగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెంచారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోని ఖమ్మంలో ఏర్పాటుచేశారు. తదుపరి సభ విజయవాడలో నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఖమ్మం విజయవాడకు దగ్గర ప్రాంతం. అందుకే ఖమ్మం బహిరంగ సభకు విజయవాడ, గుంటూరు నుంచి జనాలను తరలించగలిగారు. అందుకే విజయవాడలో ప్రత్యేకంగా సభ పెట్టాల్సిన పనిలేదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు బదులుగా విశాఖలో సభ పెడితే ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు కవరవుతాయని భావిస్తున్నట్టు సమాచారం. మార్చిలోపే ఈ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ గా విస్తరించిన తరువాత ఏపీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అన్ని పార్టీల్లో పేరుమోసిన నాయకులు సైతం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. కొంతమంది సిట్టింగ్ లు సైతం చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయంగా అంతగా స్థిరంగా లేని తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు వంటి నేతలతోనే సరిపెట్టుకున్నారు. అందుకే విశాఖ సభలో భారీగా చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్థిక మూలాలు ఉన్న బిగ్ షాట్స్ ను కేసీఆర్ వలపన్ని పట్టుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలామంది ఏపీలో వ్యాపారాలు గిట్టుబాటు కాక తెలంగాణలో తమ కార్యకలాపాలు చేసుకుంటున్నవారు ఉన్నారు. అటువంటి వారితో బీఆర్ఎస్ ఎంట్రీని గ్రాండ్ గా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అటు తోట చంద్రశేఖర్ విషయంలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా పార్టీ పట్టుకు ఇటువంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నట్టు సమాచారం. ఒకరిద్దరు బడా నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటే ఒక ఊపు వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మార్చిలో విశాఖలో బీఆర్ఎస్ సభను గ్రాండ్ గా నిర్వహించి ఏపీలో మిగతా రాజకీయ పక్షాలకు స్పష్టమైన సంకేతాలు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.