Kothagudem: ఒకరిది పదో తరగతి చదివే వయసు. మరొకరిది ఇంటర్ చదివే వయసు.. ఇలాంటివారు ఎంతోమంది.. వారిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన కొందరు మాయమాటలు చెప్పారు.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు.. ఖరీదైన హోటలల్లో ఉంచారు..హై ఫై లైఫ్ స్టైల్ అలవాటు చేశారు.. మెల్లిగా వ్యభిచార రొంపిలోకి దింపారు.. చదువుకునే వయసులో పాడు పని చేయిస్తున్నారు.. అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి.. పోలీసుల దాడితో వారి గుట్టు రట్టయింది.

కొత్తగూడెం పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తారంగా పారిశ్రామిక వాడలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్తగూడెం ప్రాంతానికి గుండెకాయ లాంటి ఏరియా.. ఇలాంటి ప్రాంతాల్లో కొంతమంది బహుళ అంతస్తుల భవనాల్లో గదులను అద్దెకు తీసుకున్నారు.. బయట యువతులకు స్వయం ఉపాధి నిమిత్తం శిక్షణ అందిస్తున్నామని బోర్డులు ఏర్పాటు చేశారు. భవన యజమానులు కూడా నిజమే అని నమ్మారు.. కానీ బయట పెట్టింది ఒకటి… లోపల జరుగుతున్నది మరొకటి.. నిండా 18 సంవత్సరాలు లేని పిల్లలతో వ్యభి చారం మొదలుపెట్టారు.. విటులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేశారు.. దాని ఆధ్వర్యంలోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమాయకులైన ఆడపిల్లల రక్త మాంసాలపై లక్షల్లో గడిస్తున్నారు.

అసలే యుక్త వయసు ఉన్న పిల్లలు కావడంతో విటులు వారికోసం భారీగా ఎగబడుతున్నారు.. వారి అవసరాన్ని నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు.. లక్షల్లో సంపాదిస్తున్నారు.. అయితే ఇటీవల వీరి వ్యవహారం పోలీసులకు తెలిసింది.. అయితే దీనిపై లోతుగా పరిశీలించిన తర్వాత… విటుల రూపంలో వెళ్లిన పోలీసులకు అక్కడి పరిస్థితులు కన్నీరు తెప్పించాయి.. వ్యభిచారం చేసే పిల్లల్లో ఎవరు కూడా 18 ఏళ్ల లోపే ఉండటం వారికి బాధను కలిగించింది.. వెంటనే బృందాలను రంగంలోకి దింపి దాడులు మొదలుపెట్టారు.. చాలా మంది పిల్లల్ని ఆ వ్యభిచార గృహాల నుంచి విముక్తులను చేశారు.. అయితే ఎంతమందిని బయటకు తీసుకొచ్చామని విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. కానీ ఈ సంఘటన కొత్తగూడెం పట్టణంలో సంచలనం సృష్టించింది.. గతంలో యాదాద్రి గుట్ట పరిధిలోను ఇలాంటి గృహాలే ఉండేవి. అయితే పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ల ద్వారా పిల్లలను కాపాడారు.. వ్యభిచార గృహాలను శాశ్వతంగా తొలగించారు.