HBD Superstar MaheshBabu: మహేష్ సినీ ఎంట్రీ… ఓ అనుకోని సంఘటన!

1975 ఆగస్టు 9 న చెన్నై లో జన్మించిన మహేష్ బాబు ఆరేళ్ల వయస్సులో తన అన్నయ్య రమేష్ తో కలిసి విజయవాడ కి వెళ్ళాడు. మహేష్ పుట్టే నాటికి సూపర్ స్టార్ కృష్ణ 100 సినిమాలకు పైగా నటించి అగ్ర హీరోగా చలామణి అవుతున్నాడు.

Written By: Shiva, Updated On : August 9, 2023 10:27 am

HBD Superstar MaheshBabu

Follow us on

HBD Superstar MaheshBabu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ అతి తక్కువ కాలంలోనే అగ్రహీరో స్థాయికి ఎదిగాడు. టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ కాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడు మహేష్ బాబు. అటు హీరోగా ఇటు నిర్మాతగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది.

1975 ఆగస్టు 9 న చెన్నై లో జన్మించిన మహేష్ బాబు ఆరేళ్ల వయస్సులో తన అన్నయ్య రమేష్ తో కలిసి విజయవాడ కి వెళ్ళాడు. మహేష్ పుట్టే నాటికి సూపర్ స్టార్ కృష్ణ 100 సినిమాలకు పైగా నటించి అగ్ర హీరోగా చలామణి అవుతున్నాడు. అప్పట్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రమేష్ “నీడ” అనే సినిమా చేస్తున్నాడు. అందులో కీలకమైన బాల నటుడి గా మహేష్ అయితే బాగుంటారని భావించాడు దాసరి.

అయితే ఈ విషయం మహేష్ కి చెప్పకుండా, అతనికి తెలియకుండా షూట్ చేశాడు దాసరి. దీంతో నీడ సినిమా ద్వారా తనకు తెలియకుండానే సినీ రంగ ప్రవేశం చేశాడు మహేష్ బాబు. ఆ తర్వాత బాల నటుడిగా అనేక సినిమాలు చేసి మంచి తెచ్చుకున్న మహేష్ బాబు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన “రాజకుమారుడు” సినిమా ద్వారా మహేష్ బాబు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అగ్ర హీరో స్థాయికి చేరుకున్నారు. చేసింది 27 సినిమాలే అయిన కానీ 8 నంది అవార్డ్స్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు.

రాజకుమారుడు సినిమా కు తొలి నంది అవార్డు అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత అనేక సినిమాలకు నందులు అందుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది. ఇండియా లోనే అత్యధిక బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించబోతున్న. ఈ సినిమా తర్వాత మహేష్ పాన్ వరల్డ్ హీరో కావడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.