Maha Samudram Telugu Movie Review:
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, జగపతిబాబు, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ తదితరులు.
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాతలు: సుంకర్ రామబ్రహ్మం
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్

హీరోగా శర్వానంద్ – విలన్ గా సిద్ధార్ద్ నటించిన సినిమా ‘మహా సముద్రం’. టాలెంటెడ్ డైరెక్టర్ అని తనకు తానే ఓ బిరుదు తగిలించుకుని ఓవర్ బిల్డప్ ఇచ్చే అజయ్ భూపతి దర్శకత్వంలో వైజాగ్ నేపథ్యంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం..
కథ :
అర్జున్ ( శర్వానంద్), విజయ్ (సిద్ధార్ద్) మంచి స్నేహితులు. విజయ్ మహాతో (అదితిరావు హైదరీ) ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గర అవుతాడు. అయితే అనుకుని జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా విజయ్ వైజాగ్ నుంచి వెళ్ళిపోతూ.. మహాను మోసం చేసి పారిపోతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అర్జున్ స్మగ్లింగ్ లోకి ఎలా దిగాల్సి వచ్చింది ?ఈ క్రమంలో చుంచు మామ (జగపతిబాబు) అర్జున్ కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు ? ఇంతకీ అర్జున్ వైజాగ్ సముద్రం పై ఆధిపత్యం సాధించాడా ? మళ్ళీ అర్జున్ జీవితంలోకి విజయ్ వచ్చి ఏమి చేశాడు ? చివరకు వీళ్ళ జీవితాలు ఎలా ముగిసాయి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
వైజాగ్ నేపథ్యంలో వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాలో ఎమోషనల్ పాత్రలో నటించిన శర్వానంద్, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సిద్ధార్ద్ చాలా సహజంగా నటించాడు. ఇక చుంచు మామ పాత్రలో నటించిన జగపతిబాబు ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఆయన నటన చాలా ఎమోషనల్ గానూ ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన రావు రమేష్ పగతో రగిలిపోయే శకునిలా.. తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలిచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోయిన్ అతిధి హైదరి రావ్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా నటించింది.
అయితే సినిమాలో మ్యాటర్ లేదు. రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ సినిమా బోర్ కొడుతుంది. అజయ్ భూపతి బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
శర్వానంద్ నటన,
నేపథ్య సంగీతం,
కొన్ని సస్పెన్స్ సీన్స్,
చివర్లో వచ్చే ట్విస్ట్ లు.
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
రొటీన్ క్రైమ్ డ్రామా వ్యవహారాలతో సాగినా.. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే శర్వానంద్ నటన అండ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే కేవలం క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్లే ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్ 2.25
Also Read: Bheemla Nayak: ఆకట్టుకుంటున్న ‘భీమ్లనాయక్’ ప్రోమో సాంగ్