దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూజర్లకు ఉచితంగా 5జీబీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం న్యూ 4జీ సిమ్ లేదా 4జీ అప్‌గ్రేడ్ ఫ్రీ డేటా కూపన్లు పేరుతో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ ఈ ఆఫర్ లో భాగంగా ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లకు 5జీబీ డేటాను అందిస్తోంది. ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని 5జీబీ డేటాను పొందవచ్చు.
Also Read: గ్యారంటీ లేకుండా రూ.5 లక్షల రుణం.. ఎలా పొందాలంటే..?
ఎయిర్ టెల్ కస్టమర్లకు 4జీ సిమ్ ను కొనుగోలు చేయడం లేదా 4జీ సిమ్ కు అప్ గ్రేడ్ కావడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందవచ్చు. మొబైల్ ఫోన్ లో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లేని కస్టమర్లు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న 30 రోజుల్లో ప్రీపెయిడ్ మొబైల్ నంబర్ తో రిజిష్టర్ కావడం ద్వారా ఈ ఆఫర్ ప్రయోజనాలను పొందవచ్చు.
Also Read: కస్టమర్లకు షావోమి బంపర్ ఆఫర్.. ఫోన్లపై 70 శాతం బైబ్యాక్..?
అయితే ఈ ఆఫర్ కు అర్హత సాధించాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వినియోగదారులు ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు ఉంటాయి. ఈ ఆఫర్ కు అర్హత సాధించిన వాళ్ల ఫ్రీ డేటాలో 2జీబీ డేటాను మినహాయించనున్నట్టు ఎయిర్ టెల్ చెబుతోంది. ఆఫర్ కు అర్హులైన వాళ్లకు ఎయిర్ టెల్ మై కూపన్స్ లో ఈ ఫ్రీ కూపన్లను అందుబాటులో ఉంచుతుంది.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
కూపన్ ను క్లెయిమ్ చేసుకున్న 72 గంటల్లో డేటాను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ కనెక్షన్ యాక్టివ్ గా ఉంటే మాత్రమే కస్టమర్లు కూపన్ ను క్లెయిమ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ ప్రయోజనం చేకూరుస్తూ ఉండటంపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.