https://oktelugu.com/

Indian Metro Transport: మెట్రో రవాణాలో భారత నగరాల ముఖచిత్రం సమగ్రంగా

మెట్రో రవాణాలో భారత నగరాల ముఖచిత్రం సమగ్రంగా వివరించిన రామ్ గారి వీడియోను కింద చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2023 / 05:20 PM IST

    భారత మెట్రో రవాణా ప్రగతి గురించి తెలుసుకుందాం. ఇవ్వాల పట్టణ రవాణాలో చాలా ప్రాముఖ్యత కలిగిన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా చెప్పొచ్చు. సబర్మన్ ట్రైన్లు ఎక్కితే అది ఎంత ఇరుకుగా ఉంటుందో అక్కడ అనుభవించేవారికి తెలుస్తుంది. ఎందుకు అంత ఇరుకుగా వెళతారంటే.. ట్రాఫిక్ లో బస్సులు, కార్లు, బైక్ లలో వెళితే ఎవ్వరూ ఆఫీసులకు వెళ్లలేరు. అందుకే రైళ్లలోనే అంత రద్దీగా ప్రయాణిస్తుంటారు. కష్టపడి వెళుతూ టైంకు చేరుకుంటారు.

    మెట్రో ఇప్పుడు వచ్చాక భారత నగరాల ముఖచిత్రం మారిపోయింది. సబర్మన్ కంటే మెట్రో ప్రయాణం సుఖవంతం.. స్వేచ్ఛగా ఇరుకు లేని ఏసీలో వెళ్లొచ్చు. మూడోది కాలుష్య రహితం. కరెంట్ తో నడుస్తుంది. ఇందులో వెళ్లడం సేఫ్టీ జర్నీ కూడా. ప్రపంచం మొత్తం మీద చూస్తే చైనాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లు ఉన్నాయి. టాప్ 1గా షాంఘై, టాప్ 2గా బీజింగ్, టాప్ 3గా గువాంగ్ ఝవ్ చైనాలు ఉన్నాయి. తర్వాత లండన్, న్యూయార్క్, మాస్కో, ఢిల్లీ (7వ స్థానంలో) ఉంది. ఆ తర్వాత సియోల్, వూహాన్, మాడ్రిడ్ లు ఉన్నాయి.

    టాప్ 10లో నాలుగు నగరాలు చైనాలో ఉన్నాయి. అందుకే అత్యధిక జనాభా ఉన్న చైనా మెట్రోలనే ఆశ్రయిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా మెట్రో విస్తరణకు అడుగులు వేస్తోంది. మొట్టమొదట దేశంలో 1984లో కోల్ కతాలో మెట్రో మొదలైంది. చాలారోజులకు 90వ చివరల్లో ఢిల్లీలో మొదలై వేగంగా విస్తరించింది. 350 కి.మీలకు పైగా ఢిల్లీలో విస్తరించింది. దేశంలో హైదరాబాద్ సహా 15 నగరాల్లో మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.

    మెట్రో రవాణాలో భారత నగరాల ముఖచిత్రం సమగ్రంగా వివరించిన రామ్ గారి వీడియోను కింద చూడొచ్చు.