Increase in the value of Telangana lands: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. రాష్ట్రంలో స్థలాల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సోమవారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లు సమావేశం నిర్వహించి రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు ఓకే చెప్పాయి. దీంతో మంగళవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. స్థలాలను బట్టి 25 నుంచి 50 శాతం పెరగడంతో భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రభుత్వానికి అధికంగా రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇక రిజిస్ట్రేషన్ విలువ పెరగునున్న నేపథ్యంలో సంబంధిత కార్యాలయాలు కిటకిటలాడాయి. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోదలచిన వారు శనివారం కార్యాలయాలకు భారీగా తరలి వచ్చారు.

రాష్ట్రంలో 33 జిల్లాల్లో కలెక్లర్లు శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్టమెంట్ల ప్లాట్లకు సంబంధించిన మార్కెట్ విలువ ను పెంచేందుకు ఆమోదముద్ర వేశాయి. ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అంటే సోమవారం ఈ ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం కొత్త ధరలు ఉంటాయన్నమాట. కొత్త ధరలతో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.3000 కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు రాబడి రానుంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పుడున్న భూముల్లో కనీసం వ్యవసాయ భూములపై 50 శాతం, ఖాళీ స్థలాలపై 35 శాతం, ఫ్లాట్లపై 25 శాతంగా ఉంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంది. విలువలు పెరగడంతో పాటు గతంలో నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5 శాతం అమలు కానున్నాయి. ఉదాహరణకు హైదబాద్ బంజారా హిల్స్ లో చదరపు గజానికి రూ.84,500 ఉండగా ప్రస్తుతం రూ.1,14,100గా నిర్ణయించారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక ధరగా చెప్పుకుంటారు.
భూముల ధరలు పెరగనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోదలచినవారు ఆయా కార్యాలయాలకు భారీగా తరలివచ్చారు. గడువు తేదీ చాలా రోజులు ఉన్నా ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. సోమవారం కూడా అవకాశం ఉండడంతో ఆరోజు కూడా రద్దీ ఉండే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ సిబ్బంది అంటున్నారు. అయితే రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉండడంతో ఎలాగైనా ఆరోజు రిజిస్ట్రేషన్ చేయించాలని పట్టుబడుతున్నారు. దీంతో సంబంధిత సర్వర్ బిజీగా మారి స్లోగా మూవ్ అవుతోంది.
రాష్ట్రంలో హైదరాబాద్ లో భూముల ధరలు అత్యధికంగా ఉన్నాయి. నగరంతో పాటు మేడ్చల్, మల్కాజ్ గిరి, భేగంపేట, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి, హబ్సీగూడ ప్రాంతాల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. హైదరాబద్ తరువాత ఖమ్మంలో అత్యధిక ధరలు ఉన్నాయి. ఇక్కడ చదరపు గజానికి రూ.52,700 ఆ తరువాత కరీంనగర్లో రూ.43,900,నిజామాబాద్,రామగుండంలో రూ.38,900, రామచంద్రాపురం, భువనగిరిలో రూ. 37,800గా కొత్త ధరలు నిర్ణయించారు.