Doctor And Nurse: అతడో డాక్టర్. విధి నిర్వహణలో ఎందరికో ప్రాణదానం చేయాల్సిన వ్యక్తి. బాధ్యతాయుతమైన పనిలో ఉన్నా అతడి బుద్ధి వక్రమార్గం పట్టింది. తోటి సహచర ఉద్యోగిపైనే కన్నేశాడు. సూటిపోటి మాటలతో వెకిలి చేష్టలతో వేధించసాగాడు. అయినా భరించింది. నాకన్న పైస్థాయి ఉద్యోగి కదాని మౌనంగా ఉండిపోయింది. ఇదే అదనుగా భావించిన అతడి ప్రవర్తన హద్దులు దాటింది. పక్కపక్క రాసుకుని తిరుగుతూ డబుల్ మీనింగ్ డైలాగులు విసురుతూ తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. దీంతో విసుగు చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీసుల చేతచిక్కి కటకటాలపాలయ్యాడు. తనను వలచిన వారి కోరిక తీర్చడం సబబే కానీ రావణుడిలా తోటి మహిళను పొందాలనుకోవడం అవివేకమని తెలియకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అందమైన నర్సు. ఆపై రాత్రి విధి. దీంతో ఆ డాక్టర్ కన్ను ఆమెపైనే ఫోకస్ అయింది. ఇంకేముంది రాత్రంతా ఎంజాయ్ చేయాలని కపట బుద్ది ప్రదర్శించాడు. అయితే వారి వయసులో తేడాలున్నందున ఆమె అతడివయసుకు గౌరవం ఇచ్చింది. అమర్యాదగా ప్రవర్తించవద్దని సూచించింది. అయినా అతడు వినలేదు. తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఫలితంగా అడ్డంగాబుక్కయ్యాడు. పోలీసుల చేత చిక్కి ఊసలు లెక్కపెడుతున్నాడు. మనసు నియంత్రణలో ఉంటేనే మనుగడ లేదంటే చెరసాలే తలగడ అవుతుందని తెలుసుకోలేకపోయాడు.
Also Read: ఊ అంటావా ఉద్యోగి, ఊఊ అంటావా?
అసోంలోని గౌహతిలో రిఫైనరీ ఆస్పత్రి ఉంది. అందులో డాక్టర్లు, నర్సులు విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి పూట కూడా దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తుండటంతో వారికి రాత్రి విధులు కూడా వేస్తుంటారు. ఇందులో భాగంగానే రాత్రి విధులకు డాక్టర్ భాస్కర్ బరూహా అనే కాంటాక్ట్ వైద్యుడు హాజరయ్యాడు. దీంతో రాత్రి పూట నర్సు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ కొంత మేర సహనం వహించింది. డాక్టర్ చేష్టలకు నొచ్చుకుంది. కానీ పైస్థాయి అధికారి కావడంతో ఏం చేయలేకేపోయింది. అయినా అతడు ఇంకా రెచ్చిపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. దీంతో విషయం తెలుసుకున్న అతడు ఆస్సత్రి నుంచి మాయమయ్యాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
కళ్లు వెళ్లిన చోటికి మనసు వెళ్లకూడదు. మనసు వెళ్లిన చోటికి మనిషి వెళ్లకూడదు. దీంతో ఎన్నో అపార్థాలు, అనర్థాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఏదైనా మనదరికి వస్తేనే అందం. మనమే వెంట పడితే నేరం. చివరకు అన్నింటిని కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మనుషుల్లో వరివర్తన అనేది రాకుండా పోతోంది. పరాయి మహిళపై కన్ను వేసి కటకటాలపాలవడంతో ఉద్యోగం పోయి జీవితమే భారంగా మారుతుందని తెలుసుకుంటే మంచిది. అలా అందరిలో మార్పు వస్తే ఇలాంటి ఘటనలు కొంతవరకైనా తగ్గే అవకాశం ఉంది.
Also Read: కరోనా: ఏపీలో 11,573 కేసులు. మరణాలు.. తెలంగాణలో 3590.. పరిస్థితి ఎలా ఉంది?