https://oktelugu.com/

గాలిపటాలు సంక్రాంతి రోజే ఎందుకు ఎగిరేస్తారు?

ప్రతి సంవత్సరం జనవరి నెలలో వచ్చే తెలుగు పండుగ అంటే సంక్రాంతి అని చెప్పవచ్చు. ఈ సంక్రాంతిని మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందేలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ సంక్రాంతి పండుగకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం మొత్తం రంగు రంగుల గాలి పటాలతో ఎంతో కనువిందు చేసేవి.  కానీ ప్రస్తుతం […]

Written By: , Updated On : January 14, 2021 / 09:38 AM IST
Follow us on

ప్రతి సంవత్సరం జనవరి నెలలో వచ్చే తెలుగు పండుగ అంటే సంక్రాంతి అని చెప్పవచ్చు. ఈ సంక్రాంతిని మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందేలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ సంక్రాంతి పండుగకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం మొత్తం రంగు రంగుల గాలి పటాలతో ఎంతో కనువిందు చేసేవి.  కానీ ప్రస్తుతం గాలిపటాలను కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఎగర వేస్తున్నారు. అయితే గాలిపటాలను సంక్రాంతి అప్పుడు మాత్రమే ఎందుకు ఎగరవేస్తారు? అనే అనుమానం చాలామందికి కలిగి ఉంటుంది. అయితే సంక్రాంతి రోజు గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా సంక్రాంతి పండుగను సూర్యుడు దక్షిణాయనంనుంచి ఉత్తరాయణంలోకి ప్రయాణిస్తాడు. ఈ విధంగా సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటాము. ఈ ధనుర్మాసంలో వీచే గాలి ఎక్కువగా తూర్పు దిశవైపు ఎత్తుపల్లాలు లేకుండా సాగటం వల్ల పతంగులను గాలిలో ఎగరవేయడానికి ఇది ఎంతో అనువైన సమయం అని చెప్పవచ్చు. రైతులు ఈ గాలిలో పండించిన పంటలను తూర్పు పట్టడానికి ఉపయోగిస్తారు.

సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఏర్పడే ధనుస్సంక్రమణం సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. అందువల్ల ఈ సమయంలో సంక్రాంతి పండుగ రావడంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు గాలిపటాలను ఎగర వేసేవారు.ఆ విధంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కనువిందు చేసేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ గాలి పటాలను కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఎగురవేస్తున్నారు.