Homeఎంటర్టైన్మెంట్Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer Review : కిసీ కా భాయ్...

Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer Review : కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ట్రైలర్ రివ్యూ: సల్మాన్ ఈజ్ బ్యాక్, వెంకీ రోల్ షాక్స్!

Kisi Ka Bhai Kisi Ki Jaan Trailer Review : సల్మాన్ ఖాన్ తన రేంజ్ భారీ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం రాధే పూర్తిగా నిరాశపరిచింది. ఆయన ఫ్యాన్స్ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వారి దాహం తీర్చేలా కనిపిస్తుంది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఎక్కడా తగ్గలేదు. రొమాన్స్ తో మొదలు పెట్టి యాక్షన్ తో ముగించారు. సల్మాన్ డిఫరెంట్ గెటప్స్ లో ఫుల్ కిక్ ఇచ్చారు.

తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి పూజా హెగ్డే… సల్మాన్ ప్రేమలో పడుతుంది. వీరి మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ అదిరింది. పూజా హెగ్డే అన్నయ్యగా వెంకటేష్ కనిపిస్తున్నారు. ఆయన వెరీ సాఫ్ట్ రోల్ చేశారని తెలుస్తుంది. వైలెన్స్ అంటే నచ్చని, దాని జోలికి పోని సాధుజీవిగా వెంకీని పరిచయం చేశారు. ట్రైలర్ లో పూజా హెగ్డేతో తెలుగు డైలాగ్స్ చెప్పించడం కొత్తగా ఉంది.

మరో టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. జగపతిబాబు ఈ చిత్రానికి ప్రధాన విలన్. జగపతిబాబు విలనిజంలో మరోసారి పీక్స్ చూపించే సూచనలు కలవు. ఇక యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టాయి. ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సల్మాన్ ఖాన్ ఫైట్స్ దుమ్మురేపాడు. రంజాన్ సల్మాన్ ఖాన్ కి కలిసొచ్చిన సీజన్. ఈ పండగకు ఆయన సినిమా వస్తుందంటే రికార్డులు బద్దలే. గతంలో ఆయన రంజాన్ కి చిత్రాలు విడుదల చేసి నయా రికార్డ్స్ సెట్ చేశారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం. ఓ సాంగ్ లో ఆయన సల్మాన్, వెంకీతో కలిసి స్టెప్ వేయనున్నాడు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి.

Kisi Ka Bhai Kisi Ki Jaan - Official Trailer | Salman Khan, Venkatesh D, Pooja Hegde | Farhad Samji

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version