
Samantha- Naga Chaitanya : ఇటీవలే మంచు మోహన్ బాబు ఇద్దరు కుమారులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ గొడవలు పడిన వీడియో సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే.ఆ తర్వాత మంచు విష్ణు దీనికి చాలా కవరింగ్ ఇచ్చాడు కానీ, జనాలు నమ్మలేదు.అయితే ఇప్పుడు ఈ ఇద్దరి అన్నదమ్ములు లాగానే అక్కినేని నాగార్జున కొడుకులు అఖిల్ మరియు నాగ చైతన్య గొడవ పడబోతున్నారా అనే సందేహాలు నెటిజెన్స్ లో మొదలైంది.
వీళ్లిద్దరు ఒకేతల్లికి పుట్టిన బిడ్డలు కాదు అనే విషయం మన అందరికి తెలిసిందే.అక్కినేని అఖిల్ నాగార్జున మరియు అమల కి జన్మించగా, అక్కినేని నాగ చైతన్య నాగార్జున మరియు లక్ష్మి దగ్గుపాటి కి జన్మించాడు.ఒకే తల్లికి పుట్టకపోయిన కూడా ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి మెలిసి ఉంటూ వచ్చారు.అన్నయ్య గా నాగ చైతన్య అఖిల్ ని చిన్నప్పటి నుండి ఎంతో బాగా చూసుకున్నాడు.
అయితే వీళ్లిద్దరి మధ్య ఇటీవల విబేధాలు ఏర్పడ్డాయని ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది.ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని అఖిల్ పుట్టినరోజు రీసెంట్ గానే జరిగింది.ఆయనకి సోషల్ మీడియా లో అభిమానులు మరియు సినీ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు కానీ నాగ చైతన్య నుండి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు రాలేదు.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
మరో పక్క సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అఖిల్ కి ఎంతో ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది, అంతే కాదు ఆమెకి మయోసిటిస్ వ్యాధి సోకిన సమయం లో కూడా అఖిల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్ పెట్టాడు.అలా తన మాజీ భార్య తో అఖిల్ ఇంకా క్లోజ్ గా ఉండడం నాగ చైతన్య కి నచ్చడం లేదని, అందుకే ఈ మధ్య ఆయన అఖిల్ తో మాట్లాడడం మానేశాడని అంటున్నారు.