https://oktelugu.com/

తమిళనాడులో వింత దేవాలయం.. రంగులు మారే వినాయకుడు..?

సాధారణంగా ఏ దేవాలయంలోనైనా విగ్రహం ఎప్పుడూ ఒకే రంగులో ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం ఆరు నెలలకు ఒకసారి విగ్రహం రంగులు మారుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సంవత్సరంలో రెండుసార్లు రంగులు మార్చుకునే ఈ విగ్రహం రంగులు మార్చుకుంటూ ప్రజలు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ సందడి చేస్తుంటారు. ఈ ఆలయంలో వినాయకుడు మార్చి నుంచి జూన్ నెల వరకు నల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2021 / 07:21 PM IST
    Follow us on

    సాధారణంగా ఏ దేవాలయంలోనైనా విగ్రహం ఎప్పుడూ ఒకే రంగులో ఉంటుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం ఆరు నెలలకు ఒకసారి విగ్రహం రంగులు మారుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సంవత్సరంలో రెండుసార్లు రంగులు మార్చుకునే ఈ విగ్రహం రంగులు మార్చుకుంటూ ప్రజలు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడూ సందడి చేస్తుంటారు.

    ఈ ఆలయంలో వినాయకుడు మార్చి నుంచి జూన్ నెల వరకు నల్ల రంగులో మిగిలిన నెలల్లో తెల్లని రంగులో ఉంటాడు. స్వామి మహత్యం వల్ల విగ్రహం రంగులు మారుతుందని ఈ గ్రామంలో గ్రామస్తులు భావిస్తారు. ఆలయం చిన్నదే అయినప్పటికీ ఎన్నో అద్భుతాలకు ఈ ఆలయం నిలయం కావడం గమనార్హం. అతిశయ వినాయగర్ పేరుతో పిలవబడే ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.

    ఈ ఆలయంలోని విగ్రహంలా ఇక్కడ ఉన్న మంచినీటి బావిలోని నీళ్లు కూడా ఆరు నెలలకు ఒకసారి రంగు మారతాయి. వినాయకుడు ఏ రంగులో ఉంటే ఆ రంగులో కూడా మరో రంగులో బావిలోని నీళ్లు ఉంటాయి. ఈ ఆలయం దగ్గర ఒక మర్రిచెట్టు ఉండగా ఆ చెట్టు ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తే దక్షిణాయనంలో ఆకులు రాలుస్తుంది. కొందరు భక్తులు ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.

    మొదట ఈ ప్రాంతంలో శివాలయం ఉండేదని ఆ తరువాత వినాయక ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెబుతారు. 2300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు పునర్నిర్మించారు.