సంచలన నిజాలు: హైకోర్టు లాయర్ దంపతుల హత్యకు అసలు కారణాలేంటి?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పట్టపగలు.. నడిరోడ్డుపై వందలాది మంది చూస్తుండగా హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యల వెనుక ప్రధానంగా కీలకమైన టీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టు సమాచారం. ప్రధానంగా హైకోర్టు లాయర్ వామన్ రావు చనిపోతూ తనను టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ చంపాడని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈరోజు కుంట శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ […]

Written By: NARESH, Updated On : February 18, 2021 7:53 pm
Follow us on

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పట్టపగలు.. నడిరోడ్డుపై వందలాది మంది చూస్తుండగా హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యల వెనుక ప్రధానంగా కీలకమైన టీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టు సమాచారం.

ప్రధానంగా హైకోర్టు లాయర్ వామన్ రావు చనిపోతూ తనను టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ చంపాడని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈరోజు కుంట శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రాత్రి మీడియాకు చూపించనున్నారు.

కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలంగా కుంట శ్రీనివాస్ తో హైకోర్టు న్యాయవాది వామన్ రావుకు విభేదాలు ఉన్నాయి. వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో ఇద్దరి మధ్య భూవివాదం ఉన్నట్టు తెలిసింది.

కుంట శ్రీనివాస్ తోనే కాదు.. హైకోర్టు లాయర్ వామన్ రావుకు మంథని నియోజకవర్గంలో చాలా మందితో విభేదాలు ఉన్నట్లు తెలిసింది. నిక్కచ్చిగా.. నీతి నిజాయితీలతో న్యాయం కోసం నిలబడే లాయర్ వామన్ రావు తీరుకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టు ప్రచారం సాగుతోంది.

వామన్ రావుకు.. ఈయనను హత్య చేసిన కుంట శ్రీనివాస్ కు మధ్య తీవ్ర గొడవులు అయ్యాయని గుంజపడుగు గ్రామస్థులు చెబుతున్నారు. గుంజపడుగ గ్రామంలోని ఓ భూవివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. 21 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ కొంతకాలంగా కుంటా శ్రీనివాస్ పై న్యాయవాది వామన్ రావు కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. గ్రామంలోని రామాలయం కమిటీ ఏర్పాటుపై వామన్ రావు విభేదించారు. పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని కుంట శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. దీనిపై పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం అనుమతి లేకుండా ఏలా ఏర్పాటు చేస్తారంటూ వామన్ రావు ప్రశ్నించారు. వామన్ తనకు గ్రామంలో అడుగడుగునా అడ్డుపడుతున్నాడనే అక్కసుతో ఈ హత్య జరిగినట్లు ప్రచారం సాగుతోంది.

ఇక గ్రామానికి సంబంధించిన గొడవల కారణంగానే వామన్ రావుపై తన కుమారుడు కుంట శ్రీనివాస్ దాడి చేశాడని అతడి తండ్రి మీడియాకు తెలిపారు. శిఖం భూముల్లో ఆలయంలో పెద్దమ్మ గుడి కట్టారని.. ఇళ్లు కట్టారని.. రామాలయ స్వామి, గోపాలయ స్వామి ఆలయం విషయంలో వామన్ రావు ప్రశ్నించినందుకే కుంటా శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడని.. అదే డాదికి కారణమైందని ఆయన తండ్రి చెప్పారు.తనకు పదేపదే అడ్డు వస్తున్నాడనే అక్కసుతోనే తన కుమారుడు హత్య చేసినట్లు ఆయన తెలిపారు.

మంథని మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుతం టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టా మధుతోనూ హైకోర్టు న్యాయవాది వామన్ రావుకి విభేదాలు ఉన్నాయని తెలిసింది. గతంలో పుట్టా మధు ఆస్తుల విషయంలో కూడా వామన్ రావు హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్, పుట్టా మధు భార్య అయిన పుట్టా శైలజ అనర్హత కేసుపై వామన్ రావు హైకోర్టులో ఆమెకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు. అలాగే మంథనిలో సంచలనం రేపిన శీలం రంగయ్య లాకప్ డెత్ కేసును కూడా వామన్ రావు వాధిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులతో పలుమార్లు వామన్ రావు మాగ్వాదం చేసినట్లు కూడా తెలుస్తోంది.

దీంతో పాటు స్థానికంగా అధికార టీఆర్ఎస్ నేతలతో వామన్ రావుకు పలు విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తనకు ప్రాణహాని ఉందని వామన్ రావు దంపతులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.