వెలుగులోకి కొత్తరకం మోసం.. సిమ్ బ్లాక్ అంటూ లక్షల్లో మాయం..?

దేశంలో సైబర్ మోసాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చదువుకుని, సైబర్ మోసాలపై అవగాహన ఉన్నవాళ్లే ఈ మోసాల బారిన పడుతుండటం గమనార్హం. ఇప్పటికే ఎన్నో సైబర్ మోసాలు వెలుగులోకి రాగా తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఒడిశాకు చెందిన ఒక డాక్టర్ ను సిమ్ కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటూ సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. మోసగాడి మాయలో పడి డాక్టర్ ఏకంగా రూ.77 లక్షలు నష్టపోయారు. Also Read: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ […]

Written By: Navya, Updated On : February 19, 2021 1:44 pm
Follow us on

దేశంలో సైబర్ మోసాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చదువుకుని, సైబర్ మోసాలపై అవగాహన ఉన్నవాళ్లే ఈ మోసాల బారిన పడుతుండటం గమనార్హం. ఇప్పటికే ఎన్నో సైబర్ మోసాలు వెలుగులోకి రాగా తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఒడిశాకు చెందిన ఒక డాక్టర్ ను సిమ్ కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటూ సైబర్ మోసగాళ్లు మోసం చేశారు. మోసగాడి మాయలో పడి డాక్టర్ ఏకంగా రూ.77 లక్షలు నష్టపోయారు.

Also Read: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే అంతే సంగతులు..?

పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కటక్ లో సనతాన్ మొహంతి అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు. మొహంతికి సైబర్ మోసగాడి నుంచి తన సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుందని.. బ్లాక్ కాకుండా ఉండాలంటే చెప్పిన విధంగా చేయాలని ఫోన్ కాల్ వచ్చింది. మొహంతి సైబర్ మోసగాడు చెప్పిన మాటలను నిజమేనని నమ్మాడు. సైబర్ మోసగాడు క్విక్ సపోర్ట్ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించగా మొహంతి ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు.

Also Read: కొత్త కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు..?

మొహంతికి మాయమాటలు చెప్పి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా తెలుసుకున్న సైబర్ మోసగాడు మహంతి బ్యాంక్ ఖాతాలోని రూ. 77,86,727 రూపాయలు తీసుకున్నాడు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి మాయం కావడంతో మొహంతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి తన డబ్బును తిరిగి ఇప్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మొహంతి కోరుతున్నాడు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు మొహంతికి తెలియకుండా అతని బ్యాంక్ ఖాతాలలో లావాదేవీలు జరిగాయి. బ్యాంకు అధికారులు, పోలీసులు సైబర్ మోసాల పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా ఈ తరహా మోసాలు జరుగుతూ ఉండటం గమనార్హం.