KCR- Early Elections: తెలంగాణ సమాజాన్ని సర్వేలతో క్షుణ్ణంగా చదివిన కేసీఆర్ ఈ మేరకు రంగం సిద్ధం చేశారు. తనకు అచ్చి వచ్చిన ‘సెంటిమెంట్’ అస్త్రాన్నే తిరిగి ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల వెనుక అసలు కథ ఇదేనంటున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడం కష్టమని తేలడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలకు ఏ అస్త్రంతో వెళ్లాలని శూలశోధన చేసిన కేసీఆర్ ఈ మేరకు తన అస్త్రాన్ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై సాగించే సమరం వెనుక వచ్చే ఎన్నికలలో విజయం సాధించే వ్యూహం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.
Also Read: World Population Day 2022: ప్రపంచ జనాభా దినోత్సవం స్పెషల్ స్టోరీ
తెలంగాణలో అభివృద్ధి ఎజెండా పనిచేయడం లేదని తేలిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పథకాల పేరిట కేసీఆర్ కోట్లు కుమ్మరించాడు. రైతు అజెండాను హైలెట్ చేశారు. ప్రజల్లోకి బలంగా వెళ్లారు. దళితబందు పేరిట ఇంటికి రూ.10లక్షలు ఇచ్చాడు. అయినా కూడా ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి ఈటలకే పట్టం కట్టారు. దీంతో అభివృద్ధి అస్త్రం పనిచేయదని భావించిన కేసీఆర్ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించేందుకు రెడీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను రెండు ఎన్నికల్లో గెలిపించిన ‘తెలంగాణ అస్త్రాన్నే’ రెడీ చేస్తున్నారు కేసీఆర్. ఈసారి తెలంగాణలో ఆంధ్రా వాదం.. పార్టీలు లేకపోవడంతో దాన్ని కేంద్రంపై ప్రయోగించబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందన్న ఆవేదనను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.

తెలంగాణ తెచ్చిన పార్టీగా తొలి 2014 ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకొని పోటీచేయడంతో.. ఇంకా ఆంధ్రుల పెత్తనం తెలంగాణపై అవసరమా? అని సెంటిమెంట్ రగిల్చి ప్రతిపక్షాలను ఓడించాడు. ఈసారి తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ లేకపోవడంతో కేసీఆర్ ఫోకస్ కేంద్రంపై పడింది.
తెలంగాణపై కేంద్రం వివక్ష.. నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్న స్వరాష్ట్రపాలనకు కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ ‘సెంటిమెంట్’ ప్రయోగించబోతున్నాడు. కేంద్రం రూపాయి ఇవ్వకున్నా అభివృద్ధి చేస్తున్నామని.. ప్రజల్లోకి వెళ్లి రాజకీయం చేయబడానికి రెడీ అయ్యారు. మరి ఈ అస్త్రం సఫలం అవుతుందా? విఫలమవుతుందా? అన్నది వేచిచూడాలి.
Also Read:KCR vs BJP: కేసీఆర్ సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అతడే?
[…] Also Read: KCR- Early Elections: కేసీఆర్ ముందస్తు ఎన్నికల వెన… […]