Chiranjeevi OTT: తెలుగు కమర్షియల్ సినిమా అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి..ఒక్కే మూసలో వెళ్తున్న తెలుగు సినిమాని స్థితిని,గతిని మార్చిన స్టార్ ఆయన..అందుకే ఆయన మెగాస్టార్ గా ఎదిగి మూడు దశాబ్దాలకు పైగా నెంబర్ 1 స్థానం లో కొనసాగాడు..తారలు మారుతుందే కొద్దీ, వారి అభిరుచులకు తగట్టుగా తనని తానూ మార్చుకొని ఆ తరం యువ హీరోలతో పోటీ పడడం మెగాస్టార్ స్టైల్..ఇప్పుడు లేటెస్ట్ గా OTT ట్రెండ్ నడుస్తుంది..ఆడియన్స్ థియేటర్స్ లో చూడడం కంటే OTT లో చూడడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..అందుకే మన స్టార్ హీరోలు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ తో OTT ద్వారా అలరిస్తున్నారు..ఇటీవలే నందమూరి బాలకృష్ణ కూడా ఆహా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ ద్వారా OTT లోకి అడుగుపెట్టి అలరించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ షో భారీ హిట్ అయ్యి బాలయ్య బాబు కి సరికొత్త ఇమేజి ని తెచ్చిపెట్టింది..ఒక్కమాట లో చెప్పాలంటే బాలయ్య బాబు ని ఈ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరకు చేసింది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా OTT లోకి అడుగుపెట్టబోతున్నాడని సోషల్ మీడియా లో గత కొద్ది రోజుల నుండి జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఒక ప్రముఖ OTT సంస్థ ఒక్క అద్భుతమైన డీల్ తో మెగాస్టార్ ముందుకి వచ్చారట..చిరంజీవి కూడా OTT లో అడుగుపెట్టేందుకు సుముఖత చూపినట్టు తెలుస్తుంది..ఇంతకాలం వెండితెర మీద మాత్రమే అభిమానులకు వినోదాన్ని పంచిన మెగాస్టార్ చిరంజీవి..ఇక నుండి OTT ద్వారా కూడా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని పంచబోతున్నాడు.
Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ క్లోజింగ్ కలెక్షన్స్.. ఫైనల్ రిజల్ట్ ఇదే

గతం లో కూడా ఆయన బుల్లితెర మీద స్టార్ మా లో ప్రసారం అయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో తో మన ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..ఇప్పుడు OTT ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి..అయితే చిరంజీవి OTT ద్వారా టాక్ షో తో మన ముందుకి వస్తాడా..లేదా ఏదైనా వెబ్ సిరీస్ ద్వారా వస్తాడా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు..మరి వెండితెర మీద మెగాస్టార్ గా మన అందరిని అలరించిన చిరంజీవి OTT ద్వారా అదే రేంజ్ లో అలరిస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read:Macherla Niyojakavargam: నితిన్ డబుల్ మీనింగులు, అంజలి ఘాటు ఫోజులు.. ఇది మామూలు రచ్చ కాదు