CM KCR : తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లను అడ్డుకున్న కేసీఆర్.. పట్టుబడ్డ ముగ్గురు నిందితులు బీజేపీకి అత్యంత సన్నిహితులంటూ పక్కా ఆధారాలను తాజాగా ప్రెస్ మీట్ లో బయటపెట్టారు. అందులో అమిత్ షా పేరు 20 సార్లు, మోడీ పేరు 2 సార్లు రావడం సంచలనమైంది. దేశ రాజకీయాల్లో ఈ వీడియోలు పెను ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. అమిత్ షా అపాయింట్ చేసే సన్నిహితుడికి ఫోన్ కాల్ కూడా వెళ్లడం ఆ వీడియోలు ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ఉందనడానికి కేసీఆర్ బయటపెట్టిన వీడియోలు ప్రధాన సాక్ష్యంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు విచారణ జరపాలని కేసీఆర్ చేతులెత్తి వేడుకోవడం సంచలనమైంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురువారం ఊహించని విధంగా సడెన్ గా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, బిజెపిపై విరుచుకుపడ్డాడు. తన పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మునుగోడు ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆగిన కేసీఆర్ తాజాగా ఆ వీడియోలు బయటపెట్టి ఆరోపణలు సమర్థించేలా సంచలన ఆధారాలు బయటపెట్టాడు. వరుస వీడియోలను ప్రదర్శించారు. తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఢిల్లీ బ్రోకర్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణలోని ఒక ఫామ్‌హౌస్‌లో గత వారం జరిగిన సంఘటన గురించి ప్రస్తావించబడింది. ఇది ఈ రోజు జరిగిన కీలకమైన ఉప ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయ తుఫానును సృష్టించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన కేసీఆర్.. “ఇంకేం కావాలి పీఎం మోడీ? ప్రధాని కంటే పెద్ద పదవి లేదు కదా? ఒకసారి కాదు రెండుసార్లు ప్రధాని అయ్యావు. అప్పుడు ఎందుకు ఈ రచ్చ? ఈ దుర్మార్గం ఎందుకు ఈ అరాచకం?” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కొందరు ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సవాలు చేసేందుకు వచ్చారు… నలుగురు ఎమ్మెల్యేలకు ₹100 కోట్లు ఆఫర్ చేశారు,” అని కేసీఆర్ విమర్శించారు. ఆ వ్యవహారాన్ని అంతా వీడియోలో చూపించారు. దాదాపు వీరి కాల్ లిస్ట్ చూస్తే దేశంలోని 8 రాష్ట్రాలను ఎలా కూల్చారు? ఎవరెవరికి కాల్స్ చేశారో అంతా డేటా తీశామని.. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా పేరు ఇందులో వచ్చిందని.. దీనిపై మోడీ సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ కేసులో పట్టుబడ్డ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజి స్వామీజీలను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల జైలు కస్టడీకి పంపారు.
