KCR Politics on Petrol Price Hike: దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఈ ధరలు తగ్గాలంటే ఏం చేయాలి? మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయాలి? తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పెట్రో మంటకు కేంద్రమే కారణమని ఆరోపిస్తోంది.

గత వారంలో ఆరు సార్లు పెట్రోల్ ధర పెరగడం దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో ముడిచమురు ధర పెరిగి ఈ పరిస్థితి వచ్చిందని.. అందుకే పెట్రోల్ ధరలు పెంచినట్టుగా కేంద్రప్రభుత్వం చెబుతోంది. ఉక్రెయిన్ యుద్ధమే కారణమా? ఆ కారణం చూపి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి. దేశంలోని పార్టీలన్నీ బీజేపీనే ఇందులో విలన్ గా చూపిస్తున్నాయి. మరి బీజేపీదే తప్పా? అన్నది మనం ఇక్కడ సమీక్షించాలి.
Also Read: Prashant Kishor- Chandrababu Naidu: పీకే వ్యూహాల మీదే బాబు భవితవ్యం ఆధారపడిందా?
అంతర్జాతీయ ధరలతో పోల్చినప్పుడు.. మన పొరుగు దేశాల్లో పెట్రోల్ ధరలను పోల్చుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో మనలాగా పెట్రోల్ ధరలు లేవు. భారత ఉపఖండంలో అత్యధిక పెట్రోల్ రేట్లు మన భారత్ లోనే ఉన్నాయి. దీనికి అంతరంగిక బాదుడే అసలు కారణం. మరి ఈ సమస్య ఎక్కడుందన్నది ఇక్కడ ఆలోచించాలి.
దేశంలో పెట్రోల్ ధరలు ఢిల్లీలో 100 రూపాయలు ఉంటే.. హైదరాబాద్ లో 114 రూపాయలు ఉంది. ఢిల్లీ కంటే తెలంగాణలో 14 రూపాయలు ఎక్కువగా ధరలున్నాయి. విశాఖలోనూ ఇదే రేటు. దీన్ని బట్టి కేసీఆర్, జగన్ లు 14 రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక దేశంలో అత్యధిక పెట్రోల్ రేట్లు ఉన్న 6 రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలు ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నవే. దీన్ని ఏం అనాలన్నది ఇక్కడ ప్రశ్న? దేశంలో పెట్రోల్ రాజకీయంలో ఎవరిది తప్పు అనే దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Also Read: Ghani Movie Non Theatrical Deal: ‘గని’కి 25 కోట్ల డీల్.. ఏమిటి నిజమేనా ?

[…] Ugadi 2022 Special Story: తెలుగు ప్రజల మొదటి పండుగ ఉగాది. దీనికో విశిష్టత ఉంది. అన్ని పండుగలు ఒకలా ఉంటే దీనికి మరో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ కాలంలో దొరికే అన్న కాయలతో పచ్చడి చేసుకోవడం దీని ఆనవాయితీ. మామిడికాయ, చింతపండు, వేపపువ్వు, బెల్లం, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్ని కలిపి షడ్రుచులుగా మిశ్రమం చేసి దాన్ని అందరికి పంచడం తెలిసిందే. దీంతో ఈ పండుగతో జీవితంలో అన్ని రుచుల మేళవింపుతో ఆనందంగా సాగాలని కోరుకుంటారు. పూర్వం నుంచే యుగాదిగా పిలవబడే ఈ పండుగతో తెలుగువారి లోగిళ్లు పరవశించిపోతాయి. పండుగతో అందరిలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. […]
[…] […]
[…] AP Cabinet Expansion: ఏపీ సీఎం జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఈ కేబినెట్ ను రద్దు చేసి కొత్త మంత్రులను తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించారు. ఇప్పటికే కేబినెట్ మంత్రులను తప్పించడం.. కొత్త మంత్రులకు అవకాశం గురించి అనేక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. […]
[…] CM KCR: కేసీఆర్ అంటే రాజకీయ చాణక్యుడు. ఏ పని చేయాలనుకున్నా సరే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. తాను అకున్న పని చుట్టూ చేయాల్సిందంతా చేసి సమయం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కుంభ స్థలాన్ని బద్దలు కొట్టడం అనే డైలాగ్ అన్నమాట. ఇలా తాను అనుకున్నది అంత పర్‌ఫెక్ట్ గా చేస్తుంటారాయన. […]