Banks Report Frauds Worth rs 34000 Crore: దేశంలో బ్యాంకుల్ని మోసం బడాబాబుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ఆర్బీఐ నివేదికలో విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నివేదిక ప్రకారం చూస్తే కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఉండటం తెలిసిందే.

ప్రస్తుత సంవత్సరంలో గడిచిన తొమ్మిది నెలల్లో రూ.34,097 కోట్ల విలువైన మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. దీనితో ఆర్థిక మోసాలతో దేశం యావత్తు నష్టాల్లోనే కూరుకుపోతోంది. దేశంలో జరుగుతున్న మోసాలతో రోజుకు దాదాపు రూ. వంద కోట్ల నష్టం జరుగుతోంది. కోట్లాది రూపాయల కుంభకోణాలతో ప్రజల నెత్తిన భారం పడుతోంది. అయినా యాభై శాతం నగదును ఇక్కడే కోల్పోతుండటం చూస్తుంటే మన పతనం మనమే తెచ్చుకుంటున్నామని తెలుస్తోంది.
ఆర్బీఐ వెల్లడించిన నివేదిక ప్రకారం చూస్తుంటే దేశంలో ఇంత భారీ స్థాయిలో మోసాలకు ఎవరు బాధ్యులో తెలియడం లేదు. కానీ ప్రజా ధనం మాత్రం పక్కదారి పడుతోంది. బడాబాబుల జేబుల్లోకి వెళ్తోంది. దీంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. అయినా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పినా ఆ దిశగా చర్యల తీసుకోవడం లేదు. అందుకే దేశంలో అప్పుల భారం పెరిగిపోతోంది.

ఈ క్రమంలో బ్యాంకుల మోసాలకు ఎక్కడ అడ్డుకట్ట పడుతుంది. ఎవరు అక్రమాలు అడ్డుకుంటారు? ఎందుకు ఈ అవస్థ. వ్యవస్థలను మోసం చేసే బడాబాబులకు సాయం చేసేదెవరు అనే ప్రశ్నలకు సమాధానాలు శూన్యమే. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్ ఎటు వైపు పోతోందో తెలియడం లేదు. కానీ ఇప్పటికైనా బ్యాంకుల్లో బడాబాబుల మోసాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలకు ధనం దొరకడం కూడా కష్టమే అని తెలుస్తోంది.
మొత్తం 27 బ్యాంకుల్లో 96 మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.4,820 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ. 13 మోసాలు, యస్ బ్యాంకులో రూ. 3,869 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.3902, కెనరా బ్యాంకులో రూ. 2658 కోట్లు నష్టపోయాయని తెలుస్తోంది.