Homeజాతీయ వార్తలుKCR Politics: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?

KCR Politics: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?

KCR Politics: కేసీఆర్ రాజకీయ అడుగులు వ్యూహాత్మకంగా ఉంటాయి. ఎవరికీ అంతబట్టవు అంటారు. ఆయన ఏం చేసినా పక్కా రాజకీయ కొలతలు ఉంటాయి. కొద్దిరోజులుగా బీజేపీపై, నరేంద్రమోడీపై కేసీఆర్ విరుచుకుపడడం వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోపణలు కొత్తవి కాదు.. కానీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో దీనిపై కొత్త ఊహాగానాలు సాగుతున్నాయి.

KCR Politics
KCR Politics

కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా హైదరాబాద్ వదిలి జిల్లాల పర్యటనలు మళ్లీ ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ప్రగతి మీ కళ్ల ముందే ఉందంటూ ఆయన అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. రైతులను ఆకట్టుకునేందుకు మీటర్లు పెట్టబోమని.. మెజార్టీ ప్రజలను బీజేపీకి వ్యతిరేకులుగా మారుస్తున్నారు. అవసరమైతే ప్రాణం ఇస్తానని.. కానీ రైతులను కాపాడుకుంటానంటూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు.

కేసీఆర్ రాజకీయ సెంటిమెంట్ డైలాగులు చూస్తే ఖచ్చితంగా ఎన్నికల సందడి దగ్గరకు రాబోతోందని తెలుస్తోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అప్పట్లో టీఆర్ఎస్ నుంచే మీడియాకు ఈ ‘ముందస్తు ఎన్నికల లీకులు’ వచ్చాయి. తర్వాత ముందస్తు ఉండదని పార్టీ నేతల కార్యవర్గ సమావేశంలోచెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవల మీడియా సమావేశంలోనూ ముందస్తు ఉండదని కేసీఆర్ తేల్చేశారు. అయినా కేసీఆర్ మదిలో అది ఉందని అంటున్నారు. విపక్షాలను తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు నమ్ముతున్నారు.

Also Read:  500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో తెలుసా ?

ఇటీవలే పవన్ కళ్యాణ్ టీంను రంగంలోకి దింపిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిపై సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలోనే మెరుగుపడే పరిస్థితులు కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే కేసీఆర్ సెంటిమెంట్ రాజేసేపనిలో పడ్డారు. ఉన్నంతలో ప్రజలను ప్రభావితం చేసే రెండు అంశాలను హైలెట్ చేసి ప్రజల భావోద్వేగాలను గరిష్ట స్థాయికి తీసుకెళ్లి ఆ టాపిక్స్ మీద ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని ప్రశాంత్ కిషోర్ నివేదించినట్టుగా భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం లేవనెత్తిన ‘రైతులకు విద్యుత్ మీటర్ల’ అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చినట్లుగా చెబుతున్నారు.దీంతోపాటు దళితబంధును హైలెట్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని అంటున్నారు. కేసీఆర్ ప్రస్తుతం ఇదే ట్రాక్ లో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు.

Also Read: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

9 COMMENTS

  1. […] Vishnu Manchu:  ఇండస్ట్రీ పెద్ద అనే పదవి కోసం కోల్డ్ వార్ నడుస్తుంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు కేంద్రంగా మొదలైన కుర్చీలాట ఇంకా కొనసాగుతుంది. మేము గొప్పంటే మేము గొప్పంటూ సినిమావాళ్లు బయట కూడా తొడలు చరుచుకుంటున్నారు. ముఖ్యంగా మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు వ్యవహారం మారింది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవితో పాటు మెగా బ్రదర్స్ పవన్, నాగబాబు మద్దతు తెలిపిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ప్రకాష్ రాజ్ పై గెలిచి అధ్యక్ష పీఠం అధిరోహించిన మంచు విష్ణు పరిశ్రమపై ఆధిపత్యం మాదేనన్న భావనకు వచ్చారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular