KCR Coverts : సంచలన నిజం : ఎలాగైనా కేసీఆరే సీఎం.. కాంగ్రెస్ లోకి కేసీఆర్ కోవర్టులు!?

ఈ నిజం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో పెను సంచలనమైంది. కాంగ్రెస్ లో పెద్ద కుదుపునకు కారణం అవుతోంది.

Written By: NARESH, Updated On : August 27, 2023 8:45 pm
Follow us on

KCR Coverts : ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో గెలుపు కేసీఆర్ దేనని అర్థమవుతోంది. కేసీఆర్ ఉన్న ఫళంగా 115 అసెంబ్లీ సీట్లను ప్రకటించడంతో చాలా మంది టికెట్ రాని వారు కాంగ్రెస్ తరుఫున పోటీచేసేందుకు ఆల్ రెడీ దరఖాస్తులు చేసేశారు. వారందరూ కూడా కేసీఆర్ కోవర్టులు అని ప్రచారం సాగుతోంది.

అంతేకాదు.. కేసీఆర్ ముందే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలోకి కొందరు నేతలను పంపారని.. బలమైన నేతలకు 30 కోట్ల చొప్పున ఇచ్చి వారిని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యతను తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఓడిపోయే చోట ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించేసి వారిని తిరిగి గెలిచాక బీఆర్ఎస్ లోకి లాగే ఎత్తుగడ వేసినట్టుగా రాజకీయవర్గాల్లో ఓ ప్రచారం మొదలైంది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా కేసీఆర్ ను కాంగ్రెస్ నమ్మకూడదని.. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రాకపోతే మొదట చీల్చేది కాంగ్రెస్ నే అని.. కాంగ్రెస్ లోకి కేసీఆర్ కోవర్టులను పంపించారని ఆరోపించారు.

ఇప్పుడు ఈ ఆరోపణలను నిజం చేస్తూ చెన్నూర్ ఎమ్మెల్యే.. మళ్లీ టికెట్ పొందిన బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నియోజకవర్గంలో తిరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను నాయకులను ఎవ్వరూ ఏం అనకండి.. వాళ్లు మనవాళ్లే.. మేమే కొంత మందిని ఎంపిక చేసి కాంగ్రెస్ లోకి పంపినం.. వాళ్లు బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారు. గెలిచినా బీఆర్ఎస్ లోకే వస్తారు. అది మా గేమ్ ప్లాన్.. ఎవరికీ చెప్పకండి’ అంటూ సంచలన నిజాన్ని బయటపెట్టారు.

ఇటీవల కేసీఆర్ అసెంబ్లీ టికెట్ల ప్రకటన సందర్భంగా ఆయన వెనుకనే బాల్క సుమన్ ఉన్నారు. కేసీఆర్ ఆ లిస్ట్ తోపాటు పలు కీలక పత్రాలు అందజేశారు. సో ఈ వ్యూహంలో బాల్కసుమన్ కూడా ఉన్నాడని.. ఆయన చెప్పేవన్నీ కేసీఆర్ చేస్తున్నాడని.. కాంగ్రెస్ లోకి కేసీఆర్ కోవర్టులను పంపాడని అర్థమవుతోంది. ఈ నిజం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో పెను సంచలనమైంది. కాంగ్రెస్ లో పెద్ద కుదుపునకు కారణం అవుతోంది. కేసీఆర్ కాంగ్రెస్ లోకి పంపిన ఆ కోవర్టులు ఎవరన్న చర్చ మొదలైంది.