Sunrisers Eastern Cape : సన్ రైజర్స్ గెలిచింది.. కావ్య పాప ఎగిరి గంతేసింది

అప్పుడు కావ్య ముఖంలో బాధ కనిపించింది. ఆ బాధను ఇప్పుడు దక్షిణాఫ్రికా తీర్చింది. ఫలితంగా కావ్య పాప నవ్వుతోంది" అని వ్యాఖ్యానిస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 11, 2024 8:32 pm
Follow us on

Sunrisers Eastern Cape : ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి తెలిసిన వాళ్ళకి.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యమారన్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్ లు చూసే కన్నా కావ్య మారన్ ను చూసేందుకు వచ్చే అభిమానులే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ జట్టు కెప్టెన్, ఆటగాళ్ల కంటే ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ బాగా ఫేమస్. ఐపీఎల్ సీజన్ కొనసాగిన సమయంలో మీడియా, సోషల్ మీడియాలో కావ్య మారన్ పేరు మార్మోగిపోయేది. ట్విట్టర్ ఎక్స్ లో అయితే ఏకంగా కావ్య మారన్ స్మైల్ పేరుతో యాష్ ట్యాగ్ సర్క్యులేట్ అయిందంటే ఆమె ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులను అలరించడానికి హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్ లకు కావ్య హాజరవుతూ ఉంటుంది. అయితే ఐపీఎల్ టోర్నీకి సంబంధించి గత మూడు సీజన్లలో హైదరాబాద్ జట్టు దారుణంగా విఫలమైంది. ఆ సమయంలో తన జట్టు ఓడిపోయినప్పుడు కావ్య నిరాశ, నిస్పృహలతో ఉండేది. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టేవి. ఆ ఫోటోలను, వీడియోలను చూసిన నెటిజన్లు కావ్య పాపపై సానుభూతి చూపించేవారు. ఇటీవల జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కావ్య మారన్ ముభావంగా ఉండటాన్ని చూసి సాక్షాత్తు రజనీకాంత్ తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించడం విశేషం.

సోషల్ మీడియాలో, మీడియాలో తెగ ఫాలోయింగ్ కలిగి ఉన్న కావ్య మారన్ కేవలం మనదేశంలోనే కాదు.. సౌత్ ఆఫ్రికా లీగ్ లోనూ సొంత క్రికెట్ జట్టును కలిగి ఉంది.. అక్కడి తన జట్టుకు కూడా “సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్” అని పేరు పెట్టింది. అయితే ఇక్కడ మూడు సీజన్ లలో ఆకట్టుకొని ఆమె జట్టు.. దక్షిణాఫ్రికాలో జరిగిన టి20 లో మాత్రం అదరగొట్టింది. ఏకంగా రెండు సీజన్లలో ట్రోఫీ లను ఒడిసి పట్టింది. గత ఏడాది సీజన్లో ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఆమె జట్టు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. తాజాగా శనివారం దక్షిణాఫ్రికాలోని కెప్టౌన్ న్యూ లాండ్స్ మైదానం ఎస్ఏ _20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ టౌన్ జట్టు డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టును ఓడించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఈ విజయంతో వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు రికార్డు సృష్టించింది..

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు 205 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో డర్బన్ జట్టు 115 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తమ జట్టు గెలిచిన ఆనందంలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు యజమాని కావ్య మారన్ ఎగిరి గంతేసింది.. ఈ విజయం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని పేర్కొంది. కావ్య మారన్ హావ భావాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజెన్లు “మన దేశంలో నిర్వహించిన టి20 మూడు సీజన్లలలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. అప్పుడు కావ్య ముఖంలో బాధ కనిపించింది. ఆ బాధను ఇప్పుడు దక్షిణాఫ్రికా తీర్చింది. ఫలితంగా కావ్య పాప నవ్వుతోంది” అని వ్యాఖ్యానిస్తున్నారు.