Delhi Liquor Scam : కీలక విషయాలు వెల్లడించిన కవిత పిఏ.. ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం

అతడు చెప్పిన ఆధారాల ప్రకారమే ఈడి ఈ కేసు కు సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పుడు కవిత అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది.

Written By: Bhaskar, Updated On : September 25, 2023 10:02 am

delhi-liquor-scam-dishadaily

Follow us on

Delhi Liquor Scam : కొన్నాళ్లపాటు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిన ఢిల్లీ లిక్కర్ స్కాం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేగంగా అడుగులు వేయడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను మరిన్ని సేకరించే పనిలో భాగంగా సరికొత్త ఎత్తులు వేయడంతో ఇందులో ఉన్న వ్యక్తులు అసలు విషయం చెప్పారు. మాగుంట శరత్ చంద్రా రెడ్డి వాంగ్మూలం మళ్ళీ తీసుకుంది. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారాడు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అతడి బాటను అనుసరించాడు. అరుణ్ పిళ్ళై కూడా నేను కూడా చెబుతాను అంటూ ముందుకు వచ్చాడు. ఈడి కోరుకున్నది కూడా ఇదే కావడంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సంపాదించింది. వీటిలో అన్ని కూడా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఉండడంతో ఆమె ఏ క్షణంలోనైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుట్టూ ఈడి ఉచ్చు బిగిస్తోంది.

కవితకు ఢిల్లీలో అశోక్ అనే వ్యక్తిగత కార్యదర్శి ఉన్నాడు. ఇతడు చెప్పిన వివరాలు ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం లో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు అభిషేక్ బోయినపల్లి, కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్, ముత్తా గౌతమ్ 100 కోట్లు తరలించాలని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అశోక్ చెప్పిన వివరాల ఆధారంగా ఈడి అధికారులు పలు కీలక సాక్ష్యాలను సేకరించాలని తెలుస్తోంది. సిబిఐ నమోదు చేసిన కేసులో సెక్షన్ 164 కింద అప్రూవర్ గా వాంగ్మూలం ఇచ్చిన అశోక్ కౌశిక్ తో పాటు నిందితుడు ముత్తా గౌతమ్ తామే సుమారు 45 కోట్లు అక్రమంగా తరలించామని దర్యాప్తు సంస్థల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. నగదు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించిన కవిత పిఏ అశోక్ కౌశిక్.. తాను అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు డబ్బు మూటలు మోసానని, ఒకచోట నుంచి మరొక చోటికి చేరవేశానని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద వాంగ్మూలం ఇచ్చిన ముత్తా గౌతమ్.. తాను స్వయంగా 7.1 కోట్లు తరలించానని ఒప్పుకున్నాడు. తన “ఇండియా ఏ హెడ్” సంస్థను అభిషేక్ బోయినపల్లి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని, ఈ సంస్థలో కవిత తరఫున అభిషేక్ బోయినపల్లి బినామీగా వ్యవహరించారని ముత్తా గౌతమ్ వెల్లడించారు. తాను కూడా 17 కోట్లు తరలించాలని మరో నిందితుడు దినేష్ ఆరోరా 164, 50 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చారు.

2021, జూన్, ఆగస్టు మధ్య అభిషేక్ బోయినపల్లి, అశోక్ కౌశిక్ (9811878055) కు ఫోన్ చేశారు. గ్రీన్ పార్క్ హోటల్ కు వెళ్లి దినేష్ అరోరాను కలుసుకోమన్నారు. దినేష్ ఆరోరా రెండు బ్యాగుల్లో ఇచ్చిన నోట్ల కట్టలను లోది రోడ్డులోని మౌసమ్ గేటు వద్ద తెల్ల పోర్ ష్చే కారులో ఉన్న వినోద్ చౌహాన్ కు ఇవ్వమన్నారు. అశోక్ కౌశిక్ అదే విధంగా చేశారు. గ్రీన్ పార్క్ లో ఉన్న దినేష్ ఆరోరా చిరునామాలను తాను గుర్తించగలనని అశోక్ చౌహన్ చెప్పారు. వాస్తవంగా ఈ కేసు కు సంబంధించి సౌత్ గ్రూపులో ఉన్న కొంతమంది కీలక సమాచారం ఇచ్చినప్పటికీ ఈ డి బలంగా అడుగులు వేయలేకపోయింది. ఎప్పుడైతే కవిత పిఏ అశోక్ కౌశిక్ ఈడి పరిధిలోకి వచ్చి కీలక విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన ఆధారాల ప్రకారమే ఈడి ఈ కేసు కు సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పుడు కవిత అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.