కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నియోజకవర్గం చిక్కోడి నియోజకవర్గంలోని గోకాకలో చోటు చేసుకున్న ఘటన స్థానికులను ఆశ్చర్యపోయేలా చేసింది. శివలింగం కళ్లు తెరవడంతో ఆ ఆలయానికి తండోపతండాలుగా జనం వస్తున్నారు. గతంలో ఈ ఆలయంలోని శివలింగం ఒకసారి కళ్లు తెరవగా శివలింగం మళ్లీ కళ్లు తెరవడం గమనార్హం. అయితే శివలింగం కళ్లు తెరవడం వల్ల ప్రజలకు మంచే జరుగుతుందని ఇది శుభ పరిణామమని పూజారి చెబుతున్నారు.
Also Read: ధనాన్ని వృధా చేస్తే ఈమె ఆగ్రహానికి గురి కావాల్సిందే..?
పూర్తి వివరాల్లోకి వెళితే బెల్గాం జిల్లాలోని గోకాక ప్రాంతంలో శివుని ఆలయం ఉంది. రోజూలానే పూజారి శివునికి పూజలు చేసిన తరువాత రాజేశ్వరి భూతీ అనే మహిళ శివుడిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. శివలింగాన్ని మహిళ దర్శించుకుంటున్న సమయంలో శివుడు కళ్లు తెరవడంతో మహిళ అవాక్కయ్యారు. మనిషిలా శివలింగం కళ్లు తెరిచి చూస్తుండటంతో మహిళ ఆశ్చర్యపోయారు.
Also Read: వెంకటేశ్వర స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడానికి కారణం ఇదే..!
అయితే సదరు మహిళ మొదట తాను భ్రమ పడ్డానని భావించి మరోసారి పరిశీలించగా శివలింగం నిజంగానే కళ్లు తెరిచి ఉండటంతో తనను శివుడు కరుణించాడని భావించి ఆ మహిళ సంతోషపడ్డారు. శివుడు కళ్లు తెరిచిన విషయం మహిళ గ్రామస్తులకు చెప్పగా గ్రామస్తులు ఆలయానికి క్యూ కట్టారు. త్వరగా ఆలయానికి వెళ్లకపోతే శివుడు కళ్లు మూసుకుపోతాయని వాళ్లు భావించారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
విషయం ఆలయ పూజారికి తెలియగా తాపీగా ఆలయానికి వచ్చిన పూజారి 2004 సంవత్సరంలో ఆలయంలో శివుడు కళ్లు తెరిచిన తరువాత ప్రపంచానికి మంచి జరిగిందని ఇప్పుడు శివుడు మళ్లీ కళ్లు తెరిచాడంటే ప్రపంచానికి మళ్లీ మంచిజరిగే అవకాశం ఉందని పూజారి పేర్కొన్నారు.