https://oktelugu.com/

2021 సంవత్సరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే..?

ప్రతి సంవత్సరం కొన్ని ఉద్యోగాలకు డిమాండ్ పెరిగితే అదే సమయంలో కొన్ని ఉద్యోగాలకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 2021 సంవత్సరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన జాబితాను ప్ర‌ముఖ కెరీర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆన్‌లైన్ స‌ర్వీస్ లింక్డిన్‌ విడుదల చేసింది. జాబ్స్ ఆన్ ద రైజ్ పేరుతో అర్హత, ప్రతిభ ఉన్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు ఉన్న ఉద్యోగాల జాబితా విడుదలైంది. Also Read: సీడాక్ సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..? 2021 సంవత్సరంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 04:09 PM IST
    Follow us on

    ప్రతి సంవత్సరం కొన్ని ఉద్యోగాలకు డిమాండ్ పెరిగితే అదే సమయంలో కొన్ని ఉద్యోగాలకు డిమాండ్ తగ్గుతుంది. అయితే 2021 సంవత్సరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన జాబితాను ప్ర‌ముఖ కెరీర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆన్‌లైన్ స‌ర్వీస్ లింక్డిన్‌ విడుదల చేసింది. జాబ్స్ ఆన్ ద రైజ్ పేరుతో అర్హత, ప్రతిభ ఉన్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు ఉన్న ఉద్యోగాల జాబితా విడుదలైంది.

    Also Read: సీడాక్ సంస్థలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

    2021 సంవత్సరంలో డిజిట‌ల్ మార్కెటింగ్‌, సోషల్ మీడియా, సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు, మార్కెటింగ్, ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల మధ్యలో డేటాను విశ్లేషించి ఈ వివరాలను లింక్డిన్ వెల్లడించింది. ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే కంటెంట్ క్రియేటర్ల ఉద్యోగాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక అంచనా ప్రకారం భారత్ లో 76 కోట్ల మొబైల్ ఫోన్ యూజర్లు ఉన్నారు.

    Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పుడంటే..?

    ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేట‌ర్ల జాబితాలో కంటెంట్ కోఆర్డినేట‌ర్లు, యూట్యూబర్లు, పాడ్‌కాస్ట్‌లు, బ్లాగర్లు వస్తారు. మరోవైపు డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ కంపెనీలు ప్రజలకు తమ ఉత్పత్తులు తెలియడం కోసం డిజిటల్ మార్కెటింగ్ పై ఆధారపడుతూ ఉండటంతో ఈ ఉద్యోగాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    మరోవైపు రోజురోజుకు డేటా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో డేటా సైన్స్ రోల్స్‌, సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు కూడా డిమాండ్ పెరుగుతోందని లింక్డిన్ చెబుతోంది. అర్హత, ప్రతిభ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే త్వరగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.