Dwarampudi:ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వైసీపీ ఎమ్మెల్యే ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ పై, కాపు సామాజికవర్గంపై నోరుపారేసుకున్నారు. కాపులను అవమానించేలా మాట్లాడారు. తన బలం ఏంటి? తన సామాజికవర్గం బలమెంత? అన్నది సోయి లేకుండా మాట్లాడారని కాపులు మండిపడుతున్నారు. కాపుల ముందు ద్వారంపూడి సామాజికవర్గం లెక్కలోకే రాదని.. గెలిపించిన వారిపై ఇలా నోరుపారేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో దొడ్డ సామాజిక వర్గం 1 %. రాష్ట్రం మొత్తం మీద వీరి వర్గం సుమారు 5 % ఉండవచ్చు. జిల్లాలో సుమారు 40 % రాష్ట్రంలో సుమారు (బీసీ కాపులతో కలిపి) 32 % ఉన్న కాపులను ఓడిస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన వెనుకున్న ‘కాపు’ కాసేవారు ఆయన మాటలు విన్నాక సిగ్గుపడక మానరు.
నీతి నిజాయితీ, అంకితభావం విషయంలో ద్వారంపూడి కంటే పవన్ కళ్యాణ్ వెయ్యి రేట్లు ఉత్తముడు. అయినా ఓడిస్తాను అంటున్నాడు అంటే ఔరా అనక తప్పదు.
ఇంతకీ ద్వారంపూడి ధైర్యానికి ఉన్న కారణాలు:
ద్వారంపూడి మైనార్టీ వర్గం అయినప్పడికి, మెజారిటీ వర్గమైన కాపులు మాకే కాపలాదారులు అనే ధైర్యం. అధికారం మా చేతిలో ఉంది. కావున మేము ఏది అయినా చెయ్యగలం అనే అహంకారం. కాపుల్లో ఉన్న ఒక వర్గాన్ని తిడితే మరొక వర్గం పిలిచి సన్మానము చేస్తాది తప్ప ఒక్కటి అవ్వరు అనే విశ్వాసం. పవన్ కళ్యాణ్’తిడితే కుల పెద్దలే పిలిచే కాళ్ళు కడిగి వారి నెత్తిన పోసుకొంటారు అనే నమ్మకం. కులపెద్దలతో మెగా ఫామిలీకి సంబంధాలు లేకపోవడం.
Also Read: Posani Shocking Comments About CM Jagan: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు
కుల సంఘాలు అనేవి అధికార పార్టీలకి దాసులు. వారు కులం కోసం ఎప్పుడు కూడా స్పందించరు అనే ధైర్యం. మెగా సోదరులను తిట్టినా గాని స్పందిచడం చేతకాని వెన్నెముక లేని నాయకులు అనే విశ్వాసం.
ముఖ్యంగా కాపు కాసేవారు పిరికోళ్ళు. స్వార్ధ పరులు, అసూయపరులు, చైనా వస్తువుల కంటే చౌకగా దొరుకుతారు. అహంకారులు. వారిలో వారు తిట్టుకు చస్తారు తప్ప ఒకరినొకరిని కలుపుకొనే తత్త్వం వీరికి లేదు. మనం సులువుగా కాపు కాసేవారిని లోబరుచుకోవచ్చు అనే వారి అహంకారం. అందుకే కాపు కాసేవారు పాలకులను కాపాడడానికి పోటీపడతారు తప్పు జాతిని కాపాడుకోలేని సజ్జలు అనే ఆధిపత్య ధోరణి.
వెరసి 1 % శాతం ఉన్నవారు.. 32 -33 % కాపులపై ఛాలెంజ్ చేయగలుతున్నారు.
ఇది అర్ధం చేసికోగలిగే జ్ఞానం గాని పరిష్కారం కోసం ప్రయత్నించే తెలివిగాని ఈ కాపు కాసేవారికి లేదు. ఇది కుల సంఘాలకు, కుల పెద్దలకు, ప్రేమలేఖలు పెద్దాయనకి కూడా వర్తిస్తుంది. వీరిని కలుపుకొంటే తప్ప, అలానే జాతిని చైతన్య పరిస్తే తప్ప అధికార సాధన సాధ్యం కాదు అనే భావన మెగా ఫామిలీలో కూడా లేదు.
పరిష్కారం: వేరే పార్టీల. నుండి పోటీ చేసే ప్రతీ కాపు కాసే నాయకుడిని ఓడించి తీరాలి. అప్పుడే మార్పు రావచ్చు
ఆలోచించండి…. తరాలు మారుతున్నా మనలో ఐకమత్యం రాధా? యజమానులు కాపాడేటప్పుడు వచ్చే పౌరుషం… జాతిని కాపాడుకోవడానికి ఎందుకు రావడం లేదు.