Yadadri Bhuvanagiri: ఓ బాలిక పేర రాసిన ఉత్తరం కలకలం రేపింది. అందరిని హడావిడి చేసింది. పరుగులు తీయించింది. ఏదో జరిగిందనే ఉద్దేశంతో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు నానా హంగామా చేశారు. అసలే విద్యార్థినులు కావడంతో అధికారుల్లో ఆందోళన పెరిగింది. ఏం జరిగిందోననే బెంగతో అందరు కంగారు పడ్డారు. కానీ చివరకు అది ఓ ఫేక్ లెటర్ అని తేలడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. చివరకు నిందితుడిపై చర్యలకు ఉపక్రమించినా అతడికి గుండె సంబంధ వ్యాధి ఉందని గ్రహించి వదిలేసిన ఘటన చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మైనార్టీ రెసిడెన్సియల్ హాస్టల్ లో ఓ విద్యార్థిని పేర జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గొంగడి సునీతకు లేఖ అందింది. దీంతో దానిపై విచారణకు ఉపక్రమించారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఉదంతంపై విచారణ జరిపారు. అంతా వట్టిదేనని తేలడంతో చివరకు నిందితుడిని బెదిరించి వదిలేశారు. కానీ లేఖ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. విద్యా సంస్థ కావడంతో అందరు కంగారు పడ్డారు. ఇంతటి దౌర్జన్యమేమిటని అందరిలో ఆందోళన పెరిగింది.
Also Read: కర్నూలు జనసేన ఆఫీసుకు తాళం.. అన్నంత పని చేసిన వైసీపీ నేతలు
సెక్యూరిటీ గార్డు గౌస్, సాజియా అనే వ్యక్తులు బట్టలు లేకుండా గదిలో గడుపుతారని, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని లేఖలో పేర్కొనడంతో భయం పెరిగింది. దీనికంతటికి కారణం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే అని తెలియడంతో అధికారులు ఊరట చెందారు. ఆసియా, ఆమె భర్త నవీద్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని పేరుతో ఉత్తరం రాసి ఇలా ఎందుకు చేశావని నిలదీశారు. కానీ అతడికి గుండె సంబంధిత వ్యాధి ఉండటంతో హెచ్చరించి వదిలేశారు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలకు పాల్పడితే చట్టపరంగా శిక్షార్హులవుతారని చెప్పారు. మొత్తానికి విద్యార్థిని పేరుతో లేఖ రాయడంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి.

అప్పటికే ఎమ్మెల్యే సునీత అధికారులతో వెళ్లి హాస్టల్ ను పరిశీలించారు. రికార్డులు సీసీ టీవీ పుటేజీలను తనిఖీ చేశారు. విద్యార్థినులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోధనేతర సిబ్బందిని సైతం ఆరా తీశారు. అంతా వట్టిదేనని తేలడంతో ఇలా ఎందుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా వ్యక్తిగత కక్షతోనే ఓ వ్యక్తి చేస్తున్నాడని ప్రిన్సిపాల్ జహీర్ ఉన్నీసా వారికి వెల్లడించార. దీంతో ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని హెచ్చరించారు.
Also Read: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు