https://oktelugu.com/

4వ టెస్ట్: ఆస్ట్రేలియాకు షాకిచ్చిన భారత బౌలర్లు

గాయాల బెడదతో దాదాపు 13 మంది కీలక ఆటగాళ్లు దూరమైన వేళ.. చివరిదైన 4వ టెస్టులో స్టాండ్ బై ఆటగాళ్లతో అనుభవం లేని పేస్ త్రయంతో భారత్ బరిలోకి దిగింది. బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, హనుమ విహారి లాంటి కీలక ఆటగాళ్లు దూరమైన తరుణంలో అందరూ కొత్త వారితో టీమిండియా తేలిపోతుందని అందరూ అనుకున్నారు. ఆస్ట్రేలియాను ఢీకొట్టడం కష్టమని అనుకున్నారు. Also Read: 4వ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ కానీ తొలిరోజు భారత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 15, 2021 / 09:37 AM IST
    Follow us on

    గాయాల బెడదతో దాదాపు 13 మంది కీలక ఆటగాళ్లు దూరమైన వేళ.. చివరిదైన 4వ టెస్టులో స్టాండ్ బై ఆటగాళ్లతో అనుభవం లేని పేస్ త్రయంతో భారత్ బరిలోకి దిగింది. బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, హనుమ విహారి లాంటి కీలక ఆటగాళ్లు దూరమైన తరుణంలో అందరూ కొత్త వారితో టీమిండియా తేలిపోతుందని అందరూ అనుకున్నారు. ఆస్ట్రేలియాను ఢీకొట్టడం కష్టమని అనుకున్నారు.

    Also Read: 4వ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

    కానీ తొలిరోజు భారత్ సత్తా చాటింది. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో మొదటి ఓవర్ లోనే టీమిండియా షాకిచ్చింది. సిరీస్ లో సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్ ను ఒక్క పరుగుకే భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్ కు పంపి భారత్ కు గొప్ప ప్రారంభాన్ని అందించాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ , శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీయడంతో ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 110/3తో ఆడుతోంది. క్రీజులో లబుషేన్ తోపాటు మాథ్యు వేడ్ ఆడుతున్నారు.

    కొత్త బౌలర్లు అయినా భారత పేస్ త్రయం గట్టిగానే పోరాడుతోంది. బాగానే బంతులు వేస్తూ ఆస్ట్రేలియన్లను కట్టడి చేస్తున్నారు. ఈ టెస్టులో అరంగేట్రం చేసిన నటరాజన్, వాషింగ్టన్ సుందర్ లు సత్తా చాటుతున్నారు.

    Also Read: తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే?

    భారత బౌలర్లను కాచుకుంటూ ఆస్ట్రేలియన్లను బాగానే ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. మరి ఇది వారికి ఎంత లాభిస్తుంది. తొలిరోజు ఆస్ట్రేలియాను టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేస్తారా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.