Jr. NTR – Kalyan Ram : తమ్ముడు ఎన్టీఆర్ వెంట కళ్యాణ్ రామ్.. ‘నందమూరి’ కుటుంబానికి దూరం.. బాబుకు షాక్ లగా!

ఇంకా.. ఈ ఈవెంట్‌కు మనవళ్లు, కుమారులు అందరూ హాజరైనా టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. వివిధ కారణాల వల్ల ఆయన రాలేకపోయారన్న ప్రకటన కూడా రాలేదు.

Written By: NARESH, Updated On : August 29, 2023 7:37 pm
Follow us on

Jr. NTR – Kalyan Ram : ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. చంద్రబాబు, పురందేశ్వరి సహా ఎన్టీఆర్ అల్లుల్లు, కూతుళ్లు అందరూ పాల్గొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ భార్య అయినప్పటికీ లక్ష్మీ పార్వతికి ఆహ్వానం లేకపోవడంతో పెద్ద వివాదం తలెత్తింది.

ఇంకా.. ఈ ఈవెంట్‌కు మనవళ్లు, కుమారులు అందరూ హాజరైనా టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. వివిధ కారణాల వల్ల ఆయన రాలేకపోయారన్న ప్రకటన కూడా రాలేదు.

ఆశ్చర్యకరంగా, జూనియర్ ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే కళ్యాణ్ రామ్ కూడా హాజరుకాకపోవడం విశేషం. కళ్యాణ్ రామ్ -జూనియర్ ఎన్టీఆర్ చాలా సంవత్సరాలుగా సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్నారు. తరచుగా వీరిద్దరూ బహిరంగ ప్రదేశాలు, కార్యక్రమాల్లో సమాన గౌరవం పొందుతున్నారు.

ఎన్టీఆర్ 100 నాణేం ఆవిష్కరణలోనూ జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే కళ్యాణ్ రామ్ కూడా నడిచి గైర్హాజరు కావడం గమనార్హం. నందమూరి కుటుంబం మొత్తం హాజరైన ఈ కార్యక్రమంలో వీరిద్దరి లోటు స్పష్టంగా కనిపించింది.

చంద్రబాబు నాయుడు సారథ్యంలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటవుతున్న ఈ నేపథ్యంలో ఆయనకు దూరంగా జూ.ఎన్టీఆర్ జరుగుతున్నారు. ఇప్పుడు తమ్ముడు వెంటనే కళ్యాణ్ రామ్ కూడా నందమూరి సమూహం నుండి దూరంగా జరగడంతో వీరిద్దరూ బాబు పరివారంలో కలవకూడదని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.

విశాలమైన నందమూరి వంశానికి దూరమవుతూనే కళ్యాణ్ రామ్ తన విధేయతను తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌ పట్ల చూపుతున్నారు. వీరిద్దరి బంధం దృఢంగా చేసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయమైనా సినిమా అయినా కలిసి నడవాలని డిసైడ్ అయ్యారు. వీరిద్దరూ చంద్రబాబు ఎత్తులకు వ్యతిరేకంగానే సాగుతున్నట్టు అర్థమవుతోంది.  ఎవ్వరు ఏమనుకున్నా.. వీరిద్దరి పంథా మాత్రం ఒక్కటిగానే ఉండబోతోందని అర్థమవుతోంది.