Kalvakuntla Kavitha : ఈడీ అధికారులతో గొడవకు దిగిన కేటీఆర్.. వైరల్ వీడియో

కవిత ఇంటి వద్దకు వచ్చిన న్యాయవాదులతోపాటు, కేటీఆర్‌, హరీశ్‌రావును కూడా ఈడీ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపటి తర్వాత కవిత న్యాయవాదులను, కేటీఆర్‌, హరీశ్‌రావును లోనికి అనుమతించారు.

Written By: Raj Shekar, Updated On : March 15, 2024 8:43 pm

Kalvakuntla Kavitha KTR

Follow us on

Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శుక్రవారం (మారి‍్చ 15న) అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేసిన ఈడీ సాయంత్రం 5:20 గంటలకు కవితకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. ఈమేరకు ఆమె భర్తకు సమాచారం అందించింది. కవిత అరెస్టు వార్త బయటకు రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా కవిత నివాసం వద్దకు చేరుకున్నాయి. కవిత సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా కవిత నివాసానికి చేరుకున్నారు.

లోనికి అనుమతించని అధికారులు..
కవిత ఇంటి వద్దకు వచ్చిన న్యాయవాదులతోపాటు, కేటీఆర్‌, హరీశ్‌రావును కూడా ఈడీ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపటి తర్వాత కవిత న్యాయవాదులను, కేటీఆర్‌, హరీశ్‌రావును లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా కవితను ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్టు చేయడంపై కేటీఆర్‌ అభ‍్యంతరం వ్యక్తం చేశారు. ఈవిషయమై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

వీడియో చిత్రీకరణ..
ఇక కేటీఆర్‌ ఈడీ అధికారులను నిలదీయడంతో అధికారులు ఆ దృశ్యాలను వీడియో షూట్‌ చేయించారు. ఈ సందర్భంగా కూడా కేటీఆర్‌ కవిత అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారని ఈడీ అధికారులను ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని ఈడీ అధికారులు లిఖిత పూర్వకంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఈమేరకు లేఖను చూపించారు. బాధిత వ్యక్తి చట్టపరమైనపరిష్కారాన్ని ఆశ్రయించవచ్చని అధికారుతుల తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

లోనికి అనుమతించకపోవడంపై..
ఈడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం కవిత ఇంటికి వచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. సోదాలు పూర్తయినా ఇంట్లోకి ఎవరినీ అనుమతించకపోవడాని‍్న తప్పుపట్టారు. శుక్రవారం కవితను మేమెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం సాధ్యం కాదని, ఆమెను ఎలా అరెస్టు చేస్తారని అధికారులను ప్రశ్నించారు.