Naga chaithanya : నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటే సమంత చంపేస్తుంది… బట్టబయలు చేసిన సీనియర్ జర్నలిస్ట్, అసలు ఏం జరుగుతుంది?

పెళ్లి తర్వాత కూడా సమంత నటన కొనసాగించింది. అక్కినేని కోడలిగా ఆ కుటుంబంలో కలిసిపోయింది. నాగ చైతన్యతో పాటు నాగార్జున, అమలతో కూడా సమంత చాలా అన్యోన్యంగా ఉండేది. అఖిల్ అయితే సమంతకు బెస్ట్ ఫ్రెండ్. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. 2021 ప్రారంభంలోనే విడాకుల రూమర్స్ వినిపించాయి. వేరువేరుగా ఉంటున్నారన్న విషయం లీకైంది.

Written By: S Reddy, Updated On : July 18, 2024 8:09 pm
Follow us on

Naga chaithanya : నాగ చైతన్య-సమంత మళ్ళీ కలుస్తారు. ఒకవేళ నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటే సమంత చంపేస్తుంది అంటూ షాకింగ్ మేటర్ వెలుగులోకి తెచ్చాడు ఓ సీనియర్ జర్నలిస్ట్. ఆయన అభిప్రాయంలో నాగ చైతన్యకు దూరమైన సమంత బాధపడుతుందట. మరలా నాగ చైతన్యను కలుస్తుందట. ఓ ఇంటర్వ్యూలో సదరు సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి.

సమంత డెబ్యూ మూవీ ఏమాయ చేసావే. నాగ చైతన్యకు ఇది రెండో చిత్రం. దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏమాయ చేసావే సూపర్ హిట్. సమంత మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ మూవీలో నాగ చైతన్య-సమంత కెమిస్ట్రీ అద్భుతం. లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేశారు. అప్పుడే వీరి మధ్య నిజమైన ప్రేమ మొదలైందనే వాదన ఉంది. కొన్నాళ్ళు రహస్యంగా ప్రేమించుకున్న సమంత, చైతన్య 2017లో గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా సమంత నటన కొనసాగించింది. అక్కినేని కోడలిగా ఆ కుటుంబంలో కలిసిపోయింది. నాగ చైతన్యతో పాటు నాగార్జున, అమలతో కూడా సమంత చాలా అన్యోన్యంగా ఉండేది. అఖిల్ అయితే సమంతకు బెస్ట్ ఫ్రెండ్. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. 2021 ప్రారంభంలోనే విడాకుల రూమర్స్ వినిపించాయి. వేరువేరుగా ఉంటున్నారన్న విషయం లీకైంది.

అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకులు ప్రకటించారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నాము. ఎప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియా సందేశంలో పొందుపరిచారు. నాగ చైతన్య , సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు దాటిపోయింది. ఇద్దరి ఏజ్ 35 ఏళ్ళు క్రాస్ అయ్యింది. కానీ అటు సమంత ఇటు నాగ చైతన్య వివాహం చేసుకోలేదు. అందుకు ఒక కారణం ఉందని అంటున్నాడు సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు. ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

ఏమంది రామారావు మాట్లాడుతూ… ఎప్పటికైనా సమంత, నాగ చైతన్య తిరిగి కలుస్తారు. ఈ విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతున్నాను. నాగ చైతన్యకు దూరమైన సమంత మానసిక క్షోభ అనుభవిస్తుంది. ఆమె ఎందుకు విడాకులు తీసుకున్నానా అని బాధపడుతుంది. ఒకవేళ నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటే.. అతని పీక పిసికి చంపేసినా చంపేస్తుంది. కాబట్టి సమంత-నాగ చైతన్య వేరొకరిని వివాహం చేసుకోరు. తిరిగి వాళ్లే కలిసిపోతారు… అన్నారు.

ఏ ఆధారాలతో ఈమంది రామారావు బల్లగుద్ది చెబుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల సమంత ఓ ఇంటర్వ్యూలో ఈ వాదనకు పూర్తిగా విరుద్ధమైన కామెంట్స్ చేయడం గమనార్హం. గత మూడేళ్లుగా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. మళ్ళీ నా జీవితంలోకి అలాంటి రోజులు రాకూడదు అనుకుంటున్నాను అన్నారు. నాగ చైతన్యతో సమంత మరలా జీవితం పంచుకోవాలి అనుకోవడం లేదని.. పరోక్షంగా చెప్పినట్లు ఆమె కామెంట్స్ ఉన్నాయి.

మరోవైపు నాగ చైతన్య పై తరచుగా ఎఫైర్ రూమర్స్ వస్తున్నాయి. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన రిలేషన్ లో ఉన్నారని సమాచారం. ఈ పుకార్లను బలపరిచేలా ఒకటి రెండుసార్లు నాగ చైతన్య-శోభిత కెమెరా కంటికి చిక్కారు. లండన్ లో ఒక రెస్టారెంట్ కి వెళ్లగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శోభితతో ఎఫైర్ రూమర్స్ నాగ చైతన్య టీమ్ ఖండించారు. ఇక నాగ చైతన్య, సమంత భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి…