Junior NTR- Ramoji Rao: జూనియర్ ఎన్టీఆర్ ని నిర్మాత రామోజీరావు హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. 2001లో నిన్ను చూడాలని మూవీతో రామోజీరావు జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా చేశారు. ఈ మూవీ ఏమంత ఆడలేదు. మళ్ళీ వీరి కాంబినేషన్ లో చిత్రం రాలేదు. ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగి స్టార్ అయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేయదు. ఉషా కిరణ్ బ్యానర్లో ఎన్టీఆర్ మరో మూవీ చేయకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. అయితే ఎన్టీఆర్-రామోజీరావు మధ్య అనుబంధం ఉంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ ముందు రామోజీరావు ఒక ప్రతిపాదన పెట్టారట. తనకు ఓ రియాలిటీ షో చేసి పెట్టాలని కోరారట. రామోజీరావు అడగ్గానే ఎన్టీఆర్ ఓకే చెప్పేస్తాడని అందరూ భావిస్తే, అనూహ్యంగా షాక్ ఇచ్చాడట. సున్నితంగా నేను ఎలాంటి షో చేయలేను అన్నారట. దాంతో రామోజీరావు నొచ్చుకున్నారట. మనవాడై ఉండి కూడా నేను రిక్వెస్ట్ చేసినా పట్టించుకోడా అని బాధపడ్డారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ఈటీవీని మరింత డెవలప్ చేయాలని రామోజీరావు ప్రణాళికలు వేస్తున్నారు. ఓటీటీ సంస్థలు సత్తా చాటుతున్న తరుణంలో ఆయన ఈ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఈటీవి విన్ పేరుతో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ స్టార్ట్ చేశారు. ఈటీవీ విన్ లో కొత్త చిత్రాలు నేరుగా విడుదల చేస్తున్నారు. ఈటీవీ కంటెంట్ మొత్తం అందులో అందుబాటులోకి తెచ్చారు. ఎన్టీఆర్ వంటి స్టార్ ఒక రియాలిటీ షో చేస్తే ఈ యాప్ కి మంచి ప్రచారం దక్కుతుంది. జనాల్లోకి వెళ్లవచ్చని రామోజీరావు భావిస్తే… అది వర్క్ అవుట్ కాలేదు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 30 మూవీ విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. దీంతో దర్శకుడు కొరటాల నిరవధికంగా షూట్స్ ప్లాన్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి నాలుగేళ్లకు పైగా సమయం కేటాయించిన ఎన్టీఆర్ ఒకింత ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన విధంగా ఎన్టీఆర్ 30 విడుదల చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.