Jammu And Kashmir- Article 311: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ ఆ ఉగ్ర మూకల దాడులు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా కర్ఫ్యూ.. రకరకాల ఆంక్షలు. అసలు భారతదేశ విభజన తర్వాత కాశ్మీర్ ప్రజలు కంటినిండా నిద్రపోయింది ఎప్పుడని? కేవలం హిందువులే లక్ష్యంగా చేసుకుని సాగే ఉగ్రమూకలకు ఒకరు షెల్టర్ ఇస్తారు. ఇంకొకరు తిండి ఇతరత్రా అవసరాలు చూసుకుంటారు. మరికొందరు డబ్బు, సెల్ ఫోన్లు ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. అసలు కాశ్మీర్లో ఉగ్రవాదులకు లభించని సౌకర్యం అంటూ ఏముందని? ఉగ్రవాదులకు సహకరిస్తున్నదే ప్రభుత్వ ఉద్యోగులు. నమ్మేందుకు కొంచెం దిగ్భ్రాంతి కలిగించినా.. నమ్మి తీరాల్సిన నిజం ఇది. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్నారని ఏకంగా 40 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ డిస్మిస్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

-ఉగ్రవాదులకు అండదండలు
హిజుబుల్ ముజాహిదీన్.. ఆ దిక్కుమాలిన పాకిస్తాన్ కు పుట్టిన ఓ ఉగ్రవాద మూక. ఈ సంస్థ చీఫ్ పేరు సయ్యద్ సలావుద్దీన్. ఈ సంస్థను నిషేధిత జాబితాలో ప్రపంచం ఎప్పుడో పెట్టేసింది. ఇక సలావుద్దీన్ కు ఏడుగురు సంతానం. ఈ ఏడుగురూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగులు. ఉగ్రవాదులకు సౌకర్యాలు కల్పించడం, వారిని హిందువులపై దాడులు చేసే విధంగా పులిగొల్పడం, ఏకంగా భారత సైన్యం కాన్వాయ్ పైనే బాంబులు విసిరేలా ప్రోత్సహించడం చేస్తుండే వారు. ఘనత వహించిన అప్పటి ప్రభుత్వం వీరిని చూసి చూడకుండా వదిలేసేది. పైగా టాక్స్ పేయర్లు కట్టిన పన్నులను జీతాలుగా ఇచ్చేది. ఇలా ఈ ఏడుగురే కాకుండా బోలెడు మంది అక్కడ ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా పని చేస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం మరి ముఖ్యంగా అమిత్ షా, అజిత్ దోవల్ కశ్మీర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏళ్లనాటి రాచపుండుకు ఆర్టికల్ 370 రద్దు మాత్రమే పరిష్కారం కాదని, తెరపైకి ఆర్టికల్ 311 ను తీసుకొచ్చారు. ఆర్టికల్ 370తో కశ్మీర్ ను చిమ్మి చీకట్ల నుంచి అభివృద్ధి బాటపట్టించిన మోడీ సర్కార్.. ఇప్పుడు ఆర్టికల్ 311తో ఉగ్రవాదుల పీఛమణిపించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేలా ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పుడా ఆర్టికల్ 311 ఏంటన్న దానిపై అందరూ ఆసక్తిగా ఆరాతీస్తున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సడెన్ ప్లాన్ ఛేంజ్.. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఆ వ్యూహం
-ఈ ఆర్టికల్ వల్ల ఏం జరిగింది
ఇంతకుముందు చెప్పినట్టుగానే వివిధ ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన ఉగ్రవాద అనుకూలురైన అధికారులను ఆర్టికల్ 311 ను ఉపయోగించి డిస్మిస్ చేయడం ప్రారంభించారు. సలావుద్దీన్ కొడుకులందరినీ వారు పనిచేస్తున్న శాఖల నుంచి తొలగించారు. తాజాగా అబ్దుల్ సయ్యద్ ముఈద్ అనే ఉగ్రవాది కొడుకుని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించారు. ప్రస్తుతం వారంతా జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. గతంలో ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేసిన అధికారులు అడ్డంగా దొరికినా, అందుకు బలమైన సాక్ష్యాధారాలు లభించినా కేసులు నమోదయ్యేవి. తర్వాత వాళ్ళ కొలువులు వాళ్లకు ఉండేవి. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్లో పరిస్థితి ఇదే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మోదీ-షా ద్వయం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో.. అప్పుడే ఉగ్రవాదుల అనుకూలురైన ఉద్యోగుల తోకలు కత్తిరించడం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను సహజంగానే పీడీపీ, ఎన్సీ, సీపీఎం వ్యతిరేకిస్తున్నాయి. వాటి జెనటిక్ క్యారెక్టరే అదే కదా.. మోడీ వ్యతిరేక స్టాండ్ కు దేశ వ్యతిరేక స్టాండ్ తేడా తెలుసుకోలేని ఆ పార్టీల భావదారిద్య్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇక అక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాలను నిరోధించేందుకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆర్టికల్ 311 ప్రయోగిస్తోంది. ఆర్టికల్ 370 ని ఎత్తేశారు. 35(ఏ)ను అవతల పారేశారు. మరి ఏంటి ఈ ఆర్టికల్ 311 అంటే.. ఈ ఆర్టికల్ లోని 2(సీ) ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు జాతికి వ్యతిరేకంగా పనిచేస్తే విచారణ అనేది లేకుండా ఉద్యోగం నుంచి తీసి పక్కన పెట్టొచ్చు. తదుపరి విచారణ కోసం జైలుకు కూడా పంపవచ్చు. ఈ కేసుల్లో నాన్ బయిలబుల్ వారెంట్లు ఉంటాయి. గతంలో ఈ చట్టాలు ఏవీ కాశ్మీర్ కు వర్తించేవి కావు. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 ని రద్దు చేశారో.. అప్పుడే భారత దేశంలో మిగతా రాష్ట్రాల మాదిరే కాశ్మీర్లో కూడా భారత రాజ్యాంగం అమలవుతుంది. ఇక ఏడాది క్రితం కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులైన మనోజ్ సిన్హా రాష్ట్రంలోని శాంతి భద్రతల పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్ కు బాస్ స్వేయిన్. ఈయన భారత గూడచార సంస్థలో ఉన్నత పదవుల్లో పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు ఉగ్రవాదులతో లింకులు కలిగి ఉన్నారు? వీరికి ఆదాయం ఎలా వస్తోంది? వీరి సోషల్ మీడియా అకౌంట్లలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ఎవరెవరికి మెసేజ్లు పెడుతున్నారు? ఈ వివరాలు అన్ని స్వేయిన్ లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదిస్తారు. ఆయన ఎంక్వయిరీ చేసి ఉద్యోగులను డిస్మిస్ చేస్తారు. వారిపై ఉన్న కేసులు ఆధారంగా జైలుకు పంపిస్తారు. దీనికి తోడు టెర్రర్ మానిటరింగ్ గ్రూప్, సైబర్ వాలంటీర్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కదలికలను, వారిపై ఉన్న కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులను మూడో కన్నుతో పరిశీలిస్తూ ఉంటాయి. వారి పరిశీలనలో ఏమాత్రం తేడా కనిపించినా ఇక అంతే సంగతులు. ఇక ఈ గ్రూపులన్నీ కూడా ఈ ఏడాది మార్చిలోనే అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ సోషల్ మీడియా ఖాతాలను మొత్తం ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇక వీరు పెట్టే ప్రతి పోస్టు కూడా నిఘా రాడార్ కి కిందకు వస్తుంది.

ఇక ఆర్టికల్ 311కు బెంబేలెత్తిపోయిన పీడీపీ, ఎన్సీ, సీపీఎంలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అవి వ్యతిరేకిస్తున్నాయి అంటే ప్రభుత్వం సరైన మార్గంలో పయనిస్తున్నట్లు లెక్క. పైగా ఇంకాస్త దూకుడు పెంచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిఐడి వెరిఫికేషన్, జీతాల్లో కోత తెరమీదకు వస్తున్నాయి. పైగా ఆయా శాఖలో అవినీతికి పాల్పడే అధికారుల పైనా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఆర్టికల్ 311 లో భాగంగా సలావుద్దీన్ కొడుకుల కొలువులతోపాటు చాలామంది కొలువులు కూడా ఊడిపోయాయి. వారిలో జేకేఎల్ ఎఫ్ లీడర్ ఫరూక్ అహ్మద్ దార్ భార్య అప్సబా కొలువు కూడా పీకేశారు. ఈ ఫరూక్ అహ్మద్ టెర్రర్ ఫండింగ్ కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. కాశ్మీర్ యూనివర్సిటీలో సైంటిస్టు అయిన ముహీత్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ ముజీద్ హుస్సేన్ కూడా ఉగ్రవాదులకు సహకరిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆర్టికల్ 311 ప్రకారం తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఎందరో.. ఇలాంటి చర్యలను సమర్థించాల్సింది పోయి వ్యతిరేకిస్తుండటం పిడిపి, ఎన్సీ, సిపిఎం పార్టీల భావదారిద్య్రానికి అసలు సిసలైన నిదర్శనం ఇదీ.
మోడీ సర్కార్ ఆర్టికల్ 311తో ఉగ్రవాదులకే కాదు.. పాకిస్తాన్ కు వెన్నులో వణుకుపుడుతోంది. ఈ ఆర్టికల్ తో ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఉద్యోగుల ఆట కట్టవుతుంది. కశ్మీర్ ను రావణకాష్టంగా మార్చేందుకు సాయపడుతున్న ఎవ్వరినీ వదిలిపెట్టకుండా మోడీ సర్కార్ చేస్తున్న ప్రయోగాలు అక్కడ శాంతి నెలకొల్పుతున్నాయి. ప్రజలంతా కూడా మోడీ సర్కార్ నిర్ణయాలను స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది.
Also Read:Nandamuri Balakrishna- Nara Lokesh: ఆహారం, ఆరోగ్యంతో ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నంలో మామా అల్లుళ్లు
[…] […]