CM Jagan : జగన్ ఇంకోసారి నోరుపారేసుకోకుండా వుండేటట్లు జనసైనికులు నిరసనలు తెలపాలి

ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దారుణంగా దిగజారి పవన్ గురించి నీచంగా మాట్లాడుతుంటే జనసైనికులు ఎందుకు తడబడుతున్నారు.

Written By: NARESH, Updated On : October 13, 2023 3:04 pm

CM Jagan : దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది జగన్ పరిస్థితి. ప్రాజెక్టుల్లో ప్యాకేజీలు తీసుకొని జైలుకు వెళ్లింది ఎవరు? తల్లిని, చెల్లిని అధికారం దక్కాక తన్ని తరిమేసింది ఎవరు? సానుభూతి కోసం కోడికత్తి కేసు సృష్టించిందెవరు? బాబాయ్ హత్య కేసులో హంతకులను రక్షించుకుంటున్నది ఎవరు? కేంద్రం డబ్బులను జగనన్న సంక్షేమ పథకాలుగా అమలు చేస్తున్నది ఎవరు? రౌడీలను మంత్రులుగా చేసింది ఎవరు? సొంత తల్లి, చెల్లిని గెంటేసిన వ్యక్తి మిగతా జనాన్ని నా కుటుంబం అంటే నమ్మాలా? ఇవన్నీ విన్నాక ఎవరు అంటే అది ఓకే ఒక వ్యక్తి ‘జగన్ మోహన్ రెడ్డి’. అటువంటి వ్యక్తి సామర్లకోట వచ్చి అధికార సమావేశం అని చూడకుండా నీచంగా వాడుకుంటే జనసైనికులు ఎందుకు మిన్నకున్నారు.

16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఆత్మరక్షణలో ఉండాలా? నీతి నిజాయితీతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్న పవన్ ఆత్మరక్షణలో ఉండాలా? అసలు జనసైనికులు దీనికి సమాధానం చెప్పడం ఏంటి? జనసైనికులు ఇంకా ఉపేక్షించడానికి లేదు.

ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దారుణంగా దిగజారి పవన్ గురించి నీచంగా మాట్లాడుతుంటే జనసైనికులు ఎందుకు తడబడుతున్నారు. జగన్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపండి.. పవన్ కుటుంబం గురించి మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని నిరసన తెలపాలి.

జగన్ వ్యాఖ్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.