Odi World Cup 2023: అహ్మదాబాద్ వేదిక గా ఇండియా పాకిస్థాన్ టీం ల మధ్య ఈనెల 14 వ తేదీన ఒక మ్యాచ్ జరగనుంది ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ప్లేయర్లలో ఎవరు అందుబాటు లో ఉంటారు అనే విషయం మీద ఇప్పటికే చాలా రకాలైన చర్చలు జరుగుతున్నాయి.నిజానికి ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు అందరు కూడా మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు.ఇక అందులో భాగం గానే మొదటి రెండు మ్యాచ్ లకి దూరం అయినా శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయాలు ఇండియన్ అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. నిజానికి గిల్ ఈ మ్యాచ్ లో కనక ఆడక పోతే ఇండియా టీమ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.నిజానికి గిల్ ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ నుంచి కోలుకొని అహ్మదాబాద్ కి చేరుకున్నాడు.
ఇక నిన్నటి వరకు బిసిసిఐ మెడికల్ టీం పర్యవేక్షణ లో ఉన్న గిల్ నిన్న ఒక గంట పాటు నెట్స్ లో ప్రాక్టీస్ కూడా చేసినట్టు గా తెలుస్తుంది.అయితే పాకిస్థాన్ మ్యాచ్ కి తాను ఎలాగైనా సరే అందుబాటు లో ఉండాలి అని గిల్ చాలా దృఢ సంకల్పం తో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడి వాళ్ళ మీద భారీ స్కోర్ చేసి వాళ్ళని ఓడించాలన్నదే ఆయన గోల్… అయితే ఇప్పుడు ఈయన ఇలా ఫీవర్ బారిన పడటం కొంతవరకు ఇబ్బంది ని కల్గించే విషయం అయినప్పటికీ మళ్లీ ఆయన తొందర గా కోలుకొని టీం లోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
ఇక గిల్ టీం లోకి రావాలని ఇండియన్ టీం మేనేజ్ మెంట్ కూడా ఆయనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.ఇక అందులో భాగం గానే ఇప్పటీకే గిల్ ఎలాగైనా మ్యాచ్ లో ఉండేవిధంగా తన శాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు.ఇక గిల్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ గ్రౌండ్ లో ఆయనకి చాలా మంది రికార్డు కూడా ఉంది.ఇప్పటికి అయన ఆ గ్రౌండ్ లో నాలుగు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడితే అందులో 300 కంటే ఎక్కువ స్కోర్ ని నమోదు చేసాడు. ఆయన యావరేజ్ వచ్చేసి 93 గా ఉంది.ఇక ఈ గ్రౌండ్ లో అయన ఇప్పటికే రెండు సెంచరీ లు, ఒక హాఫ్ సెంచరీ కూడా చేసాడు.
ఇక ఐపీల్ లో కూడా ఆయనకి ఈ గ్రౌండ్ లో మంచి రికార్డు ఉంది.ఐపీఎల్ లో ఈయన గుజరాత్ టీం తరుపున ఆడుతున్నాడు కాబట్టి ఆ టీం కి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి అందుకే ఇక్కడ ఐపీఎల్ లో కూడా ఆయనకి మంచి రికార్డ్ ఉంది.ఇప్పటికే ఆయన ఐపీఎల్ లో ఈ గ్రౌండ్ లో 67 ఆవరేజ్ తో కొనసాగుతున్నాడు.అలాగే ఇప్పటికే ఆయన ఐపీఎల్ లో రెండు సెంచరీ లు, మూడు హాఫ్ సెంచరీ లు కూడా నమోదు చేసాడు…అందుకే ఈ మ్యాచ్ లో గిల్ ఉంటె మరోసారి పాకిస్థాన్ మీద కూడా ఈ గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తాడు అనే విషయం మీదనే ఆయన టీం లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ఇక ఈయన ఇప్పటికే క్లోస్డ్ డోర్స్ లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అంటే ఇండోర్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు అలాగే నార్మల్ బౌలింగ్ లో కాకుండా త్రో బాల్స్ తో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నట్టు గా కూడా తెలుస్తుంది…అయితే ఈ మ్యాచ్ లో గిల్ అందుబాటు లో ఉంటె ఇండియన్ టీం కి అభిమానులకి పండగనే చెప్పాలి.ఇక అందుతున్న సమాచారం ప్రకారం అయితే గిల్ ఈ మ్యాచ్ లో అందుబాటు లో ఉండే విధంగానే కనిపిస్తుంది.ఈ మ్యాచ్ జరిగే టైం కి ఆయన పూర్తి ఫిట్ గా ఉంటె ఆయన టీం లో ఉంటాడు, లేకపోతే ఆయన ప్లేస్ లో వేరే ప్లేయర్ వస్తాడు…