Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Survey: పవన్‌ సర్వేలో పెరిగిన జనసేన గ్రాఫ్‌.. 2024 లో జరగబోయేది ఇదేనా?

Pawan Kalyan Survey: పవన్‌ సర్వేలో పెరిగిన జనసేన గ్రాఫ్‌.. 2024 లో జరగబోయేది ఇదేనా?

Pawan Kalyan Survey: ఆంధ్రప్రదేశలో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సారథ్యంలోని జనసేన 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే దూసుకుపోతోంది. ఇందుకోసం ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న పోరాటంతో జనసేనకు ప్రజాదారణ పెరుగుతోందని అంటున్నారు. 2019 ఎన్నికల నాటి పరిస్థితితో పోసిస్టే.. ఏపీలో బాగా పుంజుకుందని జన సేనాని పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో స్వయంగా ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందున.. జన సైనికులు, వీర మహిళలు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

Pawan Kalyan Survey
Pawan Kalyan Survey

మార్పు కోసమే జనసేన..
సమాజంలో మార్పు తీసుకురావడమ కోసం, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా జనసేనను స్థాపించినట్లు పవన కళ్యాణ్‌ స్పష్టం చేశారు. డబ్బు సంపాదించుకోవడం, అధికారం అనుభవించడం తన లక్ష్యం కాదని పునరుద్ఘాటించారు. మెరుగైన సమాజం, యువత, మహిళలకు ఉపాధి, పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా జన సేన పనిచేస్తుందన్నారు. ఇదే లక్ష్యంతో జన సైనికులు, వీర నారులు పనిచేయాలని సూచించారు. మూడేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితమిస్తోందని, పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని తెలిపారు.

అందుకే బస్సుయాత్ర వాయిదా..
ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతండడం, క్షేత్రస్థాయిలో జనసేన చేసే పోరాటాలకు ప్రజలతోపాటు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుండడంతో అందరూ ఇప్పుడు జనసేవైపు చూస్తున్నారని పవన్‌ అన్నారు. పాలకులు, ప్రతిపక్షం విఫలమైన చోట.. జన సైనికులు ప్రజా సమస్యలపై గళమెత్తాలన్నారు. ప్రజలకు, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పాలకపక్షం అధికారాన్ని కేవలం తమ అక్రమాల కోసమే ఉపయోగిస్తోందని, ప్రశ్నించేవారిని అరెస్టులు చేసి జైల్లో పెడుతోందని, అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. దేనికీ జన సైనికులు బయపడొద్దని సూచించారు. ప్రజలే మన దేవుళ్లని, వారికి భయపడాలని, వారి తరఫునే పోరాడాలని పిలుపునిచ్చారు.

అత్యాచార ఘటనలపై ఆందోళన..
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచార ఘటనలపై జనసేనాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు భద్రత కల్పించడంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, దీనిని ప్రజాక్షేత్రంలో జన సైనికులు, వీరునారులు ఎండగట్టాలన్నారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో ఎంతలా క్షిణించాయో ప్రజలకు వివరించాలని సూచించారు. బాధ్యతాయుతమైన హోమంత్రి కూడా రేపల్లోలో జరిగిన ఘటనపై స్పందించిన తీరు జుగుత్సాకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌. పాలకులు ఇలాగే ఉంటే రాష్ట్రం నేరాధ్రప్రదేశ్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Pawan Kalyan Survey
Pawan Kalyan Survey

మార్పు కోసం అధికారం ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌లో మార్పు కోసం జన సేనకు ప్రజలు అధికారం ఇవ్వాలన్న నినాదంతోనే జన సైనికులు, వీర నారులు ప్రజాక్షేత్రలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. పాలకుల తీరును, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు.

వైసీసీకి 60 లోపే సీట్లు..
ఆంధ్రప్రదేశ్‌లో జన సేన గ్రాఫ్‌ పెరుగుతుందని చెప్పిన జనసేనాని.. అదే సమయంలో అధికార వైసీపీ ప్రజాదరణ కోల్పోతుందని స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 40 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. 175 స్థానాలు గెలుస్తామని సీఎం జగన్‌ కలలు కంటున్నారన్నారు. ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇదే ఇప్పుడు జనసేనకు కలిసి వస్తుందని తెలిపారు. ఏడాదిపాటు కష్టపడితే జనసేన అధికారంలోకి వస్తుందని, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్న ధీమా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కల్పించాలని సూచించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular