spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena Party Completes 8 Years: జనసేన పార్టీకి 8 ఏళ్లు.. ప్రస్థానం

Janasena Party Completes 8 Years: జనసేన పార్టీకి 8 ఏళ్లు.. ప్రస్థానం

Janasena Party Completes  Years: జనం గుండెల్లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి స్థాపించిన ‘జనసేన పార్టీ’ నేడు తొమ్మిదో ఆవిర్భావ సభ చేసుకోబోతుంది. ఈ వేదిక నుంచి పవన్ కల్యాణ్ జనసైనికులకు దిశానిర్దేశం చేసేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసైనికులను ఉత్తేజపరిచేలా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉండనుంది. ఈక్రమంలోనే జనసేన పార్టీ ప్రస్థానం గురించి ఒకసారి నెమరువేసుకునే ప్రయత్నం చేద్దాం..!

Janasena Party Completes 8 Years
Janasena Party

* జనసేన ఆవిర్భావం..
జనసేన పార్టీని సినీనటుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో మార్చి 14న ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ చైతన్యం, తనపై విమర్శలు, ఉమ్మడి రాష్ట్ర విభజన తీరుపై ఆవేదన, పార్టీ సిద్ధాంతాలు తదితర విషయాలన్నింటిపై స్పష్టత ఇచ్చారు.

* పార్టీ లోగో.. రంగుల ప్రాముఖ్యత..
జనసేన అంటే ప్రజా సైన్యం అని అర్థం. పార్టీ గుర్తు, జెండాను మన దేశ చరిత్ర,త్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనినీ మూర్తీభవిస్తుంది.. నల్లని పోరాటాలను సూచించేలా తీర్చిదిద్దారు. ఇందులోని తెలుపు రంగు భారత నాగరికత, సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి, స్థిరత్వమును.. ఎరుపు రంగు విప్లవ చిహ్నం. లోతైన, నిజమైన మార్పును.. ఆరు మూలల నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం.. నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గాన్ని చూపించే స్వయంప్రకాశిత గుణాన్ని, మధ్యలోని బిందువు ప్రతి జీవిలోనున్న ఆత్మను, ఇదే అఖండ స చారలు విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమతూకంగా వ్యవహరించి పక్షపాతధోరణిని అసమ్మతిని దూరం చేసేలా తీర్చిదిద్దారు.

Also Read: AP Cabinet Expansion: కొడాలి నానిని కొనసాగిస్తారా? మంత్రి పదవి ఉంటుందా? అడ్డంకులివే

-ఎన్నికల్లో పోటీ..
2014 డిసెంబరు 11న ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆమోదించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో జనసేన బలపర్చిన టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో జనసేన వామపక్ష, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. 175 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయగా ఒక సీటు మాత్రమే గెలిచింది.

-2022లో జనసేన ఆవిర్భావ వేడుకలు
జనసేన ఆవిర్భావ వేడుకలు తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామంలో నేడు జరగనున్నాయి. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టారు. ఈ వేదిక నుంచే పవన్ కల్యాణ్ కల్యాణ్ జనసేన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన.. విద్య, వైద్యం మెరుగుపరచడం.. చట్టాల అమలులో అందరికీ సమన్యాయం.. ప్రజాధనం వ్యయానికి కాపలా.. జాతీయ సమైక్యత వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం కన్పిస్తోంది. రాబోయే ఎన్నికలను సిద్ధం కావాలని జనసేనాని ఈ వేదికగా పిలుపునిచ్చే అవకాశం ఉంది.

Also Read: Pawan Kalyan Sensational Statement: ఏపీ రాజకీయాలు శాసిస్తాం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper