Janasena Party Completes Years: జనం గుండెల్లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి స్థాపించిన ‘జనసేన పార్టీ’ నేడు తొమ్మిదో ఆవిర్భావ సభ చేసుకోబోతుంది. ఈ వేదిక నుంచి పవన్ కల్యాణ్ జనసైనికులకు దిశానిర్దేశం చేసేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసైనికులను ఉత్తేజపరిచేలా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉండనుంది. ఈక్రమంలోనే జనసేన పార్టీ ప్రస్థానం గురించి ఒకసారి నెమరువేసుకునే ప్రయత్నం చేద్దాం..!

* జనసేన ఆవిర్భావం..
జనసేన పార్టీని సినీనటుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో మార్చి 14న ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ చైతన్యం, తనపై విమర్శలు, ఉమ్మడి రాష్ట్ర విభజన తీరుపై ఆవేదన, పార్టీ సిద్ధాంతాలు తదితర విషయాలన్నింటిపై స్పష్టత ఇచ్చారు.
* పార్టీ లోగో.. రంగుల ప్రాముఖ్యత..
జనసేన అంటే ప్రజా సైన్యం అని అర్థం. పార్టీ గుర్తు, జెండాను మన దేశ చరిత్ర,త్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనినీ మూర్తీభవిస్తుంది.. నల్లని పోరాటాలను సూచించేలా తీర్చిదిద్దారు. ఇందులోని తెలుపు రంగు భారత నాగరికత, సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి, స్థిరత్వమును.. ఎరుపు రంగు విప్లవ చిహ్నం. లోతైన, నిజమైన మార్పును.. ఆరు మూలల నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం.. నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గాన్ని చూపించే స్వయంప్రకాశిత గుణాన్ని, మధ్యలోని బిందువు ప్రతి జీవిలోనున్న ఆత్మను, ఇదే అఖండ స చారలు విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమతూకంగా వ్యవహరించి పక్షపాతధోరణిని అసమ్మతిని దూరం చేసేలా తీర్చిదిద్దారు.
Also Read: AP Cabinet Expansion: కొడాలి నానిని కొనసాగిస్తారా? మంత్రి పదవి ఉంటుందా? అడ్డంకులివే
-ఎన్నికల్లో పోటీ..
2014 డిసెంబరు 11న ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆమోదించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో జనసేన బలపర్చిన టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో జనసేన వామపక్ష, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. 175 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయగా ఒక సీటు మాత్రమే గెలిచింది.
-2022లో జనసేన ఆవిర్భావ వేడుకలు
జనసేన ఆవిర్భావ వేడుకలు తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామంలో నేడు జరగనున్నాయి. జనసేన ఆవిర్భావ సభా వేదికకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టారు. ఈ వేదిక నుంచే పవన్ కల్యాణ్ కల్యాణ్ జనసేన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన.. విద్య, వైద్యం మెరుగుపరచడం.. చట్టాల అమలులో అందరికీ సమన్యాయం.. ప్రజాధనం వ్యయానికి కాపలా.. జాతీయ సమైక్యత వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం కన్పిస్తోంది. రాబోయే ఎన్నికలను సిద్ధం కావాలని జనసేనాని ఈ వేదికగా పిలుపునిచ్చే అవకాశం ఉంది.
Also Read: Pawan Kalyan Sensational Statement: ఏపీ రాజకీయాలు శాసిస్తాం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన