Pawan Kalyan Tour: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ తేదీ నుంచే ఏపీలో యాత్ర మొదలుపెట్టనున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు షేక్ అయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ముందుగానే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళుతుండడం హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేపట్టబోతున్నాడు.

ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేనాని పర్యటించనున్నారు. తిరుపతి నుంచి పవన్ టూర్ ప్రారంభం కానుంది. విజయదశమి రోజు నుంచి పవన్ పర్యటనకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా రోజు జనసేనాని పర్యటన మొదలుపెట్టనున్నారు.
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ ను ప్రకటించారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని మనోహర్ చెప్పారు. జనసైనికులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 6 నెలల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటించనున్నారు.
ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటన ఉండేలా షెడ్యూల్ చేశారు. ఎన్నికలకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇటీవల కాలంలో ఏపీలో పొత్తుల గురించి.. ఓరేంజ్ లో చర్చ జరిగింది. ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ ప్రకటించడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈసారి టీడీపీ కాస్త వెనక్కి తగ్గి తమకు ప్రాధాన్యం ఇస్తే బెటరన్న వ్యాఖ్యలు కూడా ఆయన నుంచి వినిపించాయి. దీంతో పొత్తుల వ్యవహారం పతాకస్థాయికి చేరింది. ఈ చర్చ సాగుతుండగానే జనసైనికులను ఈ ట్రాప్ లో పడొద్దని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏకంగా ఏపీలో ఎవరి తోడ్పాటు లేకుండా ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ కావడం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.
అక్టోబర్ – 05 – 2022, విజయదశమి నుండి జనసేనాని రాష్ట్ర వ్యాప్త పర్యటన – JanaSena PAC Chairman @mnadendla garu. pic.twitter.com/ju4J6gsZ3N
— JanaSena Party (@JanaSenaParty) June 10, 2022
[…] […]