Kashmir Elections : కాశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా? కారణాలు..

కశ్మీర్ లోని ప్రతీచోట ఉగ్రవాద మూలాలున్నాయి. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరణగా ప్రభుత్వం, సెక్యూరిటీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్ సాయంతో ఏరిపారేస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 28, 2023 7:51 pm

Kashmir Elections : కశ్మీర్ లో ఉగ్రవాద మూలాలను సర్వనాశనం చేస్తున్నారు. 70 సంవత్సరాల ఉగ్రవాద మూలాలు ఒక్క 3 సంవత్సరాల్లో నిర్మూలన అవుతుందనుకుంటే పొరపాటు. జమ్మూ కశ్మీర్ చీఫ్ మేనేజరే ఉగ్రవాదులకు మద్దతుదారు. ఇలా తెలియకుండానే సమాజంలో కీలక మైన స్థానాల్లో ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వారు వందల సంఖ్యలో ఉన్నారు.

అంతకుముందు దబీర్ సింగ్ అని చెప్పి ఒక డీఎస్పీ మూడేళ్ల క్రితం ఉగ్రవాదులకు మద్దతిస్తూ అరెస్ట్ అయ్యారు. కరెక్ట్ గా వారం క్రితం.. ఇంకొక డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్ అనే డబ్బుల కోసం ఉగ్రవాదులతో మిలాఖత్ అయ్యారు. ఫిబ్రవరిలో ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకొన్నారు. వాళ్లు 37 లక్షల డబ్బులను పట్టుకుపోతుండగా భద్రతా దళాలు పట్టుకున్నాయి. వీరి విచారణలో తేలింది ఏంటంటే.. ఈయన ఉగ్రవాదులతో కుమ్మక్కైపోయి 2.75 లక్షలు తీసుకొని కేసును మాఫీ చేయడానికి షేక్ అదిల్ ప్రయత్నించాడు. ఈ కేసు బయటపడి షేక్ అదిల్ ను సస్పెండ్ చేశారు.

కశ్మీర్ లోని ప్రతీచోట ఉగ్రవాద మూలాలున్నాయి. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరణగా ప్రభుత్వం, సెక్యూరిటీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్ సాయంతో ఏరిపారేస్తున్నారు. పోయిన వారం ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. బారాముల్లా లష్కరే తోయిబా కీలక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. రెండు కీలక టెర్రర్ మాడ్యూల్ లను భద్రతా దళాలు పట్టుకున్నారు. చాలా ఆయుధాలు దొరికాయి. ఇది కశ్మీర్ లో కంటిన్యూస్ ప్రాసెస్ట్ లో నడుస్తోంది.

కాశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా? కారణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.