CM Jagan: టిడిపికి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్

సాధారణంగా ప్రజాప్రయోజనాలు, పాలనకు సంబంధించి జీవోలు వంటి వాటికి ఇబ్బందులు ఎదురైనప్పుడే ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంది. కానీ జగన్ సర్కార్ రాజకీయ కక్షతో.. టిడిపి నాయకులకు మంజూరైన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తుండడం విస్మయ పరుస్తోంది.

Written By: Srinivas, Updated On : September 5, 2023 10:26 am

CM Jagan

Follow us on

CM Jagan: నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు.. దక్కడానికి వీల్లేదు.. ఆ మధ్యన వచ్చిన మగధీర సినిమాలో విలన్ చెప్పే డైలాగ్ ఇది. ఇప్పుడు వైసీపీ సర్కార్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. వివేకా హత్య కేసులో బంధువులు ఎవరికీ బెయిల్ రాని సంగతి తెలిసిందే. అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు అనుకున్నారో ఏమో కానీ.. ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే పనిలో పడింది వైసీపీ సర్కార్. చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ జగన్ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం న్యాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ప్రజాప్రయోజనాలు, పాలనకు సంబంధించి జీవోలు వంటి వాటికి ఇబ్బందులు ఎదురైనప్పుడే ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంది. కానీ జగన్ సర్కార్ రాజకీయ కక్షతో.. టిడిపి నాయకులకు మంజూరైన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తుండడం విస్మయ పరుస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు చోటు చేసుకున్న ఘటనలో టిడిపి నేతలు దేవినేని ఉమా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానీలకు రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్భంలో భాగంగా అంగళ్లు వెళ్ళినప్పుడు టిడిపి శ్రేణులు పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయగా… పోలీసులు మాత్రం టిడిపి నేతలు, కార్యకర్తలపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ.. జగన్ సర్కార్ ఎంత దారుణంగా కక్షపూరిత రాజకీయాలకు దిగుతుందో అర్థమవుతుంది. హత్యాయత్నం కేసులు పెట్టడానికి కనీస ఆధారాలు లభించకపోయినా… టిడిపి నేతలు అందరినీ అరెస్టు చేసి జైలుకు పంపించాలనుకున్నారు. కానీ హైకోర్టులో సరైన ఆధారాలు చూపించలేకపోయారు.. సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. అయినా సరే సుప్రీంకోర్టుకు వెళ్లడం పై న్యాయ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.