Parenting Tips: నాన్న ఈ ఒక్క మాట చాలు కొండంత అండ అనిపించడానికి. ఎంతో ధైర్యం ఆయన. ఎన్నో కలల సాకారం ఆయన. నువ్వు కన్న కలలు నిజం అవ్వాలంటే ఆయన కలలు తీరం లేని సముద్రానికి వెళ్లిపోతాయి. కలల సంగతి మర్చిపోయి నీ కల గురించే ఆయన రాత్రిళ్లు కలలు కంటాడు. . అమ్మ తర్వాతి స్థానం నాన్నకిచ్చినా.. అమ్మకంటే ఎక్కువ బాధ్యతలు తీసుకునే ఒక గొప్ప మనిషి నాన్న. అలాంటి నాన్నతో చిన్నతనంలో కలవడానికి కాస్తా భయం అనిపిస్తుంటుంది కదా. కారణం ఆయన గంభీరంగా ఉంటూ నిన్ను సక్రమైన మార్గంలో నడిపించాలి అనుకోవడం. కానీ, వయసు పెరిగే కొద్దీ ఆయన గొప్పతనం అర్థం అవుతుంది. ఆ తర్వాత ఆయన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మరి చెప్పలేని మంచితనం, త్యాగం, దయ వంటి ఎన్నో గుణాలను తనలో దాచుకొని మీ కోసం కష్టపడే మీ నాన్న గురించి ఆయనతో మంచి రిలేషన్ మెయింటెన్ చేయడానికి కొన్ని ఫాలో అవ్వాలి అవేంటో చూసేద్దామా?
ఏదైనా బాధపడిన సందర్భంలో తండ్రులు తమ పిల్లలకి సపోర్ట్ అందించడం కామన్ గా జరుగుతుంటుంది. ఇదే విధంగా, పిల్లలు కూడా తండ్రులకు అదే సపోర్ట్ అందించడం కొన్ని సార్లు చూస్తుంటాం. ఇలా ఉంటే మీ రిలేషన్ ఆరోగ్యంగా ఉన్నట్టే. అంటే మీ రిలేషన్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ వారికి మీరున్నారనే ధైర్యం ఇవ్వడం చాలా ముఖ్యం. దీని వల్ల కోట్లు పెట్టినా కొనలేని ఆనందం మీ తండ్రి సొంతం అవుతుంది కదా. మనసులో ఏదీ పెట్టుకోకుండా ప్రతి విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడటం వల్ల మీ బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఓపెన్ కమ్యూనికేషన్ వల్ల ప్రతి రిలేషన్ చాలా హెల్దీగా ఉంటుంది.
ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకోవడం మరింత ముఖ్యం. వారి విషయాలను కనుక్కోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు మీ నాన్నతో ఎంత క్లోజ్‌గా ఉన్నా డిసిప్లిన్ ముఖ్యం అని అర్థం చేసుకోండి. మరీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు వారిని ఎలా గౌరవించాలో తెలుసుకొని మరీ వ్యవహరించండి. దీంతో పిల్లలతో పాటు పెద్దల గౌరవం బాగుంటుంది. నాన్నకి కూడా నా పిల్లలు నన్ను గౌరవిస్తున్నారు అనే ఆనందం రెట్టింపు అవుతుంది.
ఎవరితోనైనా మంచి రిలేషన్ మెంటెయిన్ అవ్వాలంటే మనకి కావాల్సింది కోట్లలో డబ్బు కాదు. కానీ కాస్త సమయం అని గుర్తు పెట్టుకోండి. వారితో కాస్తా టైమ్ మెంటెయిన్ చేస్తే అదే వారికి కోట్ల సంతోషం. ఇద్దరు కలిసి గేమ్స్, స్ప్రోర్ట్స్ ఇద్దరికీ నచ్చే పనులు చేయడం వల్ల చాలా సంతోషిస్తారు. దీంతో ఇద్దరు టైమ్ స్పెండ్ చేయడం వల్ల అందరికీ రిలాక్స్ అనిపిస్తుంది. హ్యాపీగా గడిపేస్తారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఇష్టాఇష్టాలు ఉంటాయి. వాటిని కనుక్కుని వాటిపై టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఇష్టాలను ముందుగానే గుర్తించి వాటిని తీర్చేందుకు మీ ప్రయత్నం మీరు చేయడం బెటర్. దీని వల్ల మంచి ర్యాపో ఏర్పడి మిమ్మల్ని పిల్లల్లా కాకుండా స్నేహితుల్లా చూస్తారు. వారి శేషజీవితం సంతోషంగా గడుపుతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More