https://oktelugu.com/

Gac Fruit : పోషకాలు మెండుగా.. ఈ పండు కేజీ ధర తెలిస్తే షాక్ కావాల్సిందే!

చర్మం కూడా కాంతివంతంగా మెరిచేలా చేయడంలో ఈ పండు ప్రధాన పాత్ర వహిస్తుంది. ముఖంపై మెటిమలు, మచ్చలు రాకుండా కూడా ఉంచుతుంది. కాబట్టి ఈ ఫూట్‌ను తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం మేలు.

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2024 / 05:30 AM IST

    Gac Fruit Benefits

    Follow us on

    Gac Fruit  : అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలామంది పండ్లను డైట్‌లో చేర్చుకుంటారు. పండ్లలోని పోషకాలు ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే మనలో చాలామందికి గ్యాక్ ఫ్రూట్ గురించి పెద్దగా తెలియదు. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని రోజూ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండులో పోషకాలు మాత్రమే నిండు కాదండోయ్.. ఖరీదు కూడా ఎక్కువగానే ఉంది. ఈ పండు కేజీ ధర దాదాపుగా రూ.500 వరకు ఉంటుంది. ఇందులోని బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పంట పండిస్తే లాభాలు కూడా పొందుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ఏయే సమస్యలు రాకుండా గ్యాక్ ఫ్రూట్ కాపాడుతుందో తెలియాలంటే పూర్తిగా ఈ ఆర్టికల్ చదివేయండి.

    క్యాన్సర్ కణాలను నాశనం
    ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. పూర్తిగా క్యాన్సర్‌ను కూడా ఈ పండు నివారిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్ ప్రమాదం రాకుండా కాపాడుతుంది. కాబట్టి రోజుకి చిన్న ముక్క అయిన తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    కంటి ఆరోగ్యం
    ఇందులోని విటమిన్లు, ఖనిజాల వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మాక్యులా డీజెనరేషన్ ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ ఫ్రూట్‌లో విటమిన్ ఎ, సీ, ఈ, బీ6, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

    రోగనిరోధక శక్తి
    గ్యాక్ ఫ్రూట్‌లో విటమిన్ సి, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు శరీరానికి రాకుండా ఈ పండు అడ్డుకుంటుంది. కేవలం పండు మాత్రమే తినకుండా దీనిని జ్యూస్‌లా చేసి కూడా తాగవచ్చు. అలాగే ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి కూడా కాపాడుతుంది.

    గుండె ఆరోగ్యంగా..
    ఈ ఫ్రూట్‌లో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సాయపడతాయి. అలాగే మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది.

    చర్మ ఆరోగ్యం
    గ్యాక్ ఫ్రూట్‌లో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్య సంకేతాలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మెరిచేలా చేయడంలో ఈ పండు ప్రధాన పాత్ర వహిస్తుంది. ముఖంపై మెటిమలు, మచ్చలు రాకుండా కూడా ఉంచుతుంది. కాబట్టి ఈ ఫూట్‌ను తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం మేలు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.