spot_img
Homeహెల్త్‌Fake Milk : నకిలీ పాలను గుర్తించడం ఎలా?

Fake Milk : నకిలీ పాలను గుర్తించడం ఎలా?

Fake Milk :  పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరు పాలు తాగుతుంటారు. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఈరోజుల్లో అన్ని కల్తీ అయిపోతున్నాయి. మనం తినే ఫుడ్ నుంచి వాడే వస్తువుల వరకు అన్ని ఇలాంటి కల్తీ పదార్థాలను తినడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నతనంలోనే పిల్లలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పూర్వకాలంలో వయస్సు పెరిగిన ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. కానీ ఈరోజుల్లో చిన్నపిల్లలు, వయస్సులో ఉన్నవారు కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి ముఖ్యకారణం నకిలీ పదార్థాలను తినడమే. పాలను తప్పకుండా చిన్నపిల్లలు రోజూ తాగుతారు. దీనివల్ల వారికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ వీటినే కల్తీ చేస్తే ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి నకిలీ పాలను గుర్తించడం ఎలా? ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.

అయోడిన్ రియాజెంట్..
కల్తీ పాలను గుర్తించాలంటే ఒక టెస్ట్ ట్యూబ్‌‌లో పాలు తీసుకోవాలి. దీనికి సగం అయోడిన్ రియాజెంట్ కలిపి బాగా మిక్స్ చేయాలి. పాలు లేత గోధుమ రంగులోకి మారితే అవి స్వచ్ఛమైన పాలు అని అర్థం చేసుకోవాలి. అదే చాక్లెట్ రంగులోకి మారితే పాలు కల్తీ అయినట్లే.

డిటర్జెంట్ పౌడర్
కొంచెం పాలు తీసుకుని అందులో డిటర్జెంట్ పౌడర్ కలపాలి. ఇందులో కొంచెం నీరు వేసి బాగా తిప్పాలి. అలా తిప్పినప్పుడు డిటర్జెంట్ బాగా నురగ వస్తే పాలు కల్తీ అయినట్లే. అదే తక్కువగా నురగ వస్తే అవి స్వచ్ఛమైన పాలు అని అర్థం చేసుకోవాలి. పాలు చిక్కగా ఉండాలని కొందరు డిటర్జెంట్ పౌడర్ కలుపుతుంటారు. కాబట్టి డిటర్జెంట్‌తో పౌడర్‌తో కల్తీ పాలను గుర్తించండి.

నీరు ఎక్కువగా కలిపితే..
పాలిష్ చేసిన స్లాంట్ ఉపరితలంపైన ఒక చుక్క వరకు పాలను వేయాలి. ఇలా వేసినప్పుడు అది కదలకుండా ఆగిపోతే పాలు స్వచ్ఛంగా ఉన్నట్లు. అదే తెల్లటి జాడను వెనుక వదిలివేస్తే పాలలో నీరు కల్తీ అయినట్లు గుర్తించవచ్చు.

ఈరోజుల్లో ఎక్కడ చూసిన ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. వెల్లుల్లి, పాలు, యాపిల్ ఇలా ఒకటేంటి.. మనం తినే ప్రతిది కూడా కల్తీ జరుగుతుండటం చూస్తునే ఉన్నాం. రసాయనాలతో కల్తీ పదార్థాలను తయారు చేయడం వల్ల ఎక్కడ లేని అనారోగ్య సమస్యలు అన్ని వస్తాయి. కాబట్టి ఏ వస్తువులను అయిన కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనండి. ఇందులోని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పాలు వంటి పదార్థాలు పిల్లలు ఎక్కువగా తీసుకుంటారు. దీంతో పిల్లలు చిన్నవయస్సు నుంచే వ్యాధుల బారిన పడతారు. కాబట్టి ఇలా బయట పాలను కొనే బదులు ఆవు పాలు వంటివి పిల్లలకు పెట్టడం మంచిది. వీటిలో కూడా కొందరు కల్తీ చేస్తారు. వీలైతే ఆవును పెంచుకోవడం ఉత్తమం.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular