https://oktelugu.com/

Jagan Plan B: జగన్ ప్లాన్ ‘బీ’ రెడీ.. ‘మాజీ’లకు కూడా పదవులు..!

Jagan Plan ‘B’ Ready: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే పార్టీలో ఎవరీ రోల్ ఎంటీ? ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలనే దానిపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తన మంత్రి మండలిని సైతం పూర్తిగా ప్రక్షాళన చేశారు. జగన్ కొత్త క్యాబినేట్ పూర్తిగా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీదనే సాగింది. దీనికితోడు పరిపాలన సౌలభ్యం కోసం పలువురు సీనియర్ నేతలను […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2022 10:33 am
    Follow us on

    Jagan Plan ‘B’ Ready: రాబోయే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే పార్టీలో ఎవరీ రోల్ ఎంటీ? ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలనే దానిపై సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తన మంత్రి మండలిని సైతం పూర్తిగా ప్రక్షాళన చేశారు.

    జగన్ కొత్త క్యాబినేట్ పూర్తిగా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీదనే సాగింది. దీనికితోడు పరిపాలన సౌలభ్యం కోసం పలువురు సీనియర్ నేతలను క్యాబినెట్లో కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయి. ఈనేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయులుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితర నేతలకు క్యాబినెట్లో బెర్త్ దక్కలేదు.

    మరోవైపు కొత్త క్యాబినెట్లో చోటు దక్కించుకునేందుకు పెద్దసంఖ్యలో ఆశావహులు ప్రయత్నాలు చేశారు. 11మంది పాతవారిని తిరిగి క్యాబినేట్లో కొనసాగించడంతో ఆశవహులకు నిరాశే మిగిలింది. అలాగే కొంతమంది మంత్రులను పక్కన పెట్టడంతో తాము చేసిన తప్పెంటీ? అని ఆ నేతలు సైతం క్యాబినేట్ కూర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

    మాజీ మంత్రులు బాలినేని, సుచరిత, తదితర నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డిపై అలక బూనారు. ఈక్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని వారందరినీ పిలిపించి బుజ్జగించడంతో పార్టీలో పరిస్థితి సర్ధుమణిగింది. అయితే ఈ ఎఫెక్ట్ పార్టీపై ప్రభావం చూపకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ‘బీ’ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

    మాజీ మంత్రులు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలకు సైతం త్వరలోనే క్యాబినేట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లా అభివృద్ది మండళ్లను తెరపైకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ముందుగా స్టేట్ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దీనికి కొడాలి నానిని చైర్మన్ చేస్తారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.

    అలాగే జిల్లాల వారీగా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. 11 మంది మాజీ మంత్రులను పదకొండు జిల్లాలకు ఛైర్మన్లుగా నియమించే అవకాశం ఉంది. మరో 15 జిల్లాలకు కొత్త మంత్రులతోపాటు మంత్రి ఆశించి భంగపడిన నేతలకు పదవులు దక్కనున్నాయి. వీరందరికీ క్యాబినేట్ హోదా దక్కనుంది. అయితే నిధులు, విధులపై స్పష్టత మాత్రం ఉండదు.

    ఇప్పటికే జిల్లాల్లో జిల్లా ప్రణాళిక కమిటీలు, అభివృద్ధి కమిటీలు ఉన్నాయి. ప్లానింగ్ కమిటీలన్నీ పంచాయితీరాజ్‌ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుండగా, డీడీఆర్‌సీలకు కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయి మంత్రి పదవికి, జిల్లా స్థాయి పదవికి చాలా తేడా ఉందని పలువురు వైసీపీ సీనియర్లు గొణుక్కుంటున్నారు.

    నిధులు.. విధులు ఉండని పోస్టులతో తమకు అగౌరవేనని పలువుర పలువురు వైసీపీ నేతలు భావిస్తున్నారట. దీంతో తామంతా ఉత్సవ విగ్రహాలు మారిపోతామని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా వైసీపీలో అసంతృప్తులను చల్చబరిచేలా  సీఎం జగన్ తెరపైకి తెచ్చిన జిల్లా బోర్డులు ఏమేరకు సత్పఫలిస్తాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    Tags